శోభ మృతదేహం, సుబ్రహ్మణ్యం మృతదేహం
తుంగతుర్తి : ఆరోగ్యం సహకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇద్దరు బలవన్మరణం పొందారు. తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బొజ్జ శోభ(26) బావిలో దూకి, త్రిపురారంలో దువ్వాలి సుబ్రహ్మణ్యం పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు. నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొజ్జ శోభ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె ఆరోగ్యాన్ని బాగుచేయించేందు కు తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి గతవారం భార్యాభర్తలు కలిసి దేవుడమ్మ (భూతవైద్యురాలు) వద్దకు వచ్చారు. ఆరోగ్యం కుదుట పడాలంటే మూడు వారాల పాటు ఇక్కడికి రా వా లని దేవుడమ్మ చెప్పడంతో చివరివారం ఆది వారం భార్య, భర్త, కూతురు కలిసి బైక్‌పై సంగెం వచ్చారు.
దేవుడమ్మ వద్ద ఎక్కువ జనం ఉండడంతో వెంకటేశ్ నేను వెళ్తున్నానని, దేవుడమ్మ వద్ద చూపించుకున్న అనంతరం ఫోన్‌చేయమని భార్య కు చెప్పి, స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అనంతరం శోభ తన నాలుగేళ్ల కూతురుని తీసుకుని కోడూరువైపు వెళ్లి అక్కడ ఉన్న బావిగడ్డపై కూతురుని కూర్చోబెట్టి బావిలో దూకింది. అటుగా వస్తున్న ఓ ప్రయాణికుడు పాప ఏడుపు, సెల్‌ఫోన్ రింగ్ అవుతుండటంతో దగ్గరికి వెళ్లి పాపను ఓదార్చి ఫోన్ లిప్ట్ చేశాడు. ఫోన్‌లో శోభ భర్త వెంకట్‌తో సంగెం సమీపంలోని బావి వద్ద పాప ఏడుస్తుంది.. పక్కన ఎవరులేరని చెప్పాడు. పాప బావివైపు వెళ్లిందని సంజ్ఞలు చేయడంతో బావిలో చూశాడు. బావిలో శోభ చెప్పులు కన్పి స్తుండడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అనంత రం భర్త, గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని శోభ మృతదేహాన్ని వెలికితీశారు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బాలునాయక్ కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శోభ విగతజీవిగా పడి ఉండడంతో పాప ఏడుపు అక్కడివారిని కలిచివేసింది.
పురుగుల మందు తాగి వ్యక్తి..
త్రిపురారం(నాగార్జునసాగర్) : అనారోగ్య కారణంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురారం మం డల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దువ్వారి సుబ్రహ్మణ్యం(48) కారుడ్రైవర్‌గా పని చేస్తూ జీవన సాగిస్తున్నాడు. ఇటీవల సు బ్రమణ్యం అనారోగ్యానికి గురై తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సుబ్రహ్మణ్యం త్రిపురారం గ్రామ శివారులో వ్యవసాయ పొ లాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు.
ఆదివారం ఉదయం వ్యవసాయ పొలాల్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహం స్థానికులను కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని సంఘటన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు త్రిపురారం ఎస్‌ఐ ఆరీఫ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment