ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సోకిందన్న భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితం వెలువడక ముందే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు... పంజాబ్‌లోని బాలాచూర్‌కు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు గత ఏడాది కాలంగా సిడ్నీలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మార్చి 18న అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన అతడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం దిగాడు. కరోనా లక్షణాల భయంతో తనకు తలనొప్పి వస్తుందని విమాన సిబ్బందితో చెప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా అతడిని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏడో అంతస్తుకు షిఫ్ట్ చేశారు. (మఫ్టీలో వచ్చి.. కానిస్టేబుల్ అనుచిత చర్య)
ఈ నేపథ్యంలో అంటువ్యాధి సోకిందన్న భయంతో సదరు యువకుడు అక్కడి నుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అతడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి వివరాలు తెలుసుకునేందుకు తాము ఆస్పత్రికి వెళ్తే అధికార వర్గాలు సరిగా స్పందించలేదని ఆరోపించారు. సఫ్గార్‌జంగ్ ఆస్పత్రికి వెళ్తే అక్కడి నుంచి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లమన్నారని.. అక్కడ కూడా అతడి పేరు లిస్టులో కనిపించకపోయేసరికి నిరాశతో వెనుదిరిగామని వాపోయారు. బాధితుడి మృతికి ఆస్పత్రి వర్గాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.(కరోనా కథ.. ఇల్లే సురక్షితం)
Comments
Please login to add a commentAdd a comment