పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్ | Rowdy Sheeter Encounter In Chennai | Sakshi
Sakshi News home page

కత్తి దూశాడు.. కాల్చి చంపారు

Published Sat, Jun 15 2019 10:55 AM | Last Updated on Sat, Jun 15 2019 11:15 AM

Rowdy Sheeter Encounter In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌ పాపం పండింది. ప్రజలపైనే కాకుండా పోలీసులపై కూడా కత్తి దూయడంతో అతడి ప్రాణాన్ని తుపాకీ తూటలు బలితీసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని వ్యాసార్పాడిలో వల్లరసు అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఓ కేసు విషయంలో అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులుపై వల్లరసు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే వల్లరసు దాడిలో ఎస్‌ఐ పవన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వల్లరుసుపై హత్యా, హత్యాయత్నం, దాడులు వంటి పలు కేసులు ఉన్నాయి. గతంలో సెక్రటేరియట్ కాలనీలో ఓ హత్యకేసులో నిందితుడుగా ఉన్న వల్లరుసుపై హతుడి బంధువులు  హత్యాయత్నం చేయడంతో అక్కడి నుంచి పారిపోయి మాదవరంలో తలదాచుకున్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement