తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుపతికి.. | rpf police catched two kids in Nadikudi railway station | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుపతికి..

Published Thu, Feb 22 2018 9:59 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

rpf police catched two kids in Nadikudi railway station - Sakshi

కుటుంబ సభ్యులకు చిన్నారులను అప్పగిస్తున్న కానిస్టేబుల్‌ వైకేరావు

గుంటూరు, నడికుడి(దాచేపల్లి): నడికుడి రైల్వేస్టేషన్‌ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను ఆర్పీఎఫ్‌ పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్లేందుకు ఎక్కిన ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి స్టేషన్‌లో దిగారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ వైకే. రావు చిన్నారులను విచారణ చేయగా ఇంట్లో చెప్పకుండా తాము తిరుపతి వెళ్లేందుకు రైలులో వచ్చామని చెప్పారు. బీబీనగర్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌బాషా కుమారుడు ఖలీల్, కె. స్వామి కుమారుడు శ్రీకాంత్‌ తొమ్మిదో తరగతి  చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి వెళ్లకుండా నేరుగా సికింద్రాబాద్‌ వెళ్లి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు విచారణలో తేలింది. ఇద్దరు చిన్నారులను స్టేషన్‌లో ఉంచి సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు.  సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ ఖలీల్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ వైకే. రావు చిన్నారులను తల్లిదండ్రులకు బుధవారం అప్పగించారు. కానిస్టేబుల్‌ వైకే. రావును సీఐ, ఎస్‌ఐ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement