తిరుపతిసిటీ: పెళ్లికి ముస్తాబు చేసిన కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ వాసు కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని మంగళం క్వార్టర్స్ గృహాల మధ్య కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మానుష్య ప్రాంతంలో పెళ్లికి ముస్తాబు చేసిన స్క్వాడా కారు కనిబడింది. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఎర్రచందనం దుంగలు కనిపించాయి. నలుగురు వ్యక్తులు వుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment