బస్తర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్‌పూర్‌లోని తిరియా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కాగా మరోవైపు మహారాష్ట్రలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాము ఇక దళంతో కలిసి పనిచేయమని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆరుగురు సీనియర్ నక్సల్స్ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ. 32లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment