bastar district
-
తుల్తులీ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.మూడో తేదీనే చేరుకున్న బలగాలు మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్‌కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.పట్టు సాధించిన బలగాలుబస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్‌ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్మడ్ ప్రాంతం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం 31 కాదు 35 మంది మృతి..తుల్తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు. -
భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోల మృతి
బస్తర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్పూర్లోని తిరియా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించగా.. మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా మరోవైపు మహారాష్ట్రలో ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాము ఇక దళంతో కలిసి పనిచేయమని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆరుగురు సీనియర్ నక్సల్స్ లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ. 32లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
ఐఈడీ పేలుడు: జవానుకు తీవ్ర గాయాలు
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా కిష్టారం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. దీంతో కూంబింగ్‌లో ఉన్న ఘనశ్యాం అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిగూడెం గ్రామం దాటాక చిన్న నాలా వద్ద ఈ సంఘటన జరిగింది. మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని వెంటనే హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా అస్పత్రికి తరలించారు. -
ఆరుగురు మావోయిస్టుల ఎన్కౌంటర్
చింతూరు (తూర్పుగోదావరి జిల్లా): ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని కొండగావ్ జిల్లాలో శనివారం సాయంత్రం పోలీసులకు, మావోరుుస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. జిల్లాలోని ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమిడి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రెస్క్యూ గార్డ్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్‌ల జవాన్లు కూంబింగ్‌కు వెళ్లినట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ రెండు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఘటనాస్థలంలోని ఆనవాళ్లను బట్టి ఆరుగురు మావోయిస్టులు మృతిచెంది ఉంటారన్నారు. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఘటనాస్థలంలో మూడు 12 బోరు తుపాకులు, 12 కిట్‌బ్యాగులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నామని, పరారైన మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎదురుకాల్పుల్లో చాలామంది మావోయిస్టులు గాయపడినట్టు తెలిపారు. -
అడవిలో అంతర్జాతీయ వైద్యం
సాంకేతికం చత్తీస్గడ్ రాష్ర్టంలో చాలా జిల్లాలున్నాయి. కానీ బస్తర్ జిల్లా మాత్రం దేశంలోని ప్రతి ఒక్కరికీ పరిచయం. అక్కడున్న ‘అన్నల’ వల్ల ఆ జిల్లా దేశ వ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నక్సల్స్ ప్రాబల్యం వ ల్లే అసలు ఆ ప్రాంతం అన్నింటికీ దూరమైందనే అభిప్రాయం ఉంది. అక్కడ రోడ్లు వేయరు. వేసినా వాటిని ఉండనివ్వరు. ఎవరూ దుకాణం పెట్టరు, ఏ అధికారీ అక్కడ పనిచేయడానికి ఇష్టపడడు... ఇంతమందికి ఇష్టంలేనిది ఆ అటవీ ప్రాంతపు జిల్లా డాక్టర్లకు మాత్రం ఎలా నచ్చుతుంది? అందుకే అక్కడి ప్రజలకు ఏదైనా అనారోగ్యం వస్తే ఒక జీవితం అర్పణం. మందులుండవు. మాకులుండవు. అలా రోగంతో కుంగి కుశించి నశించాల్సిందే. ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయంటే ఆ ప్రాంతంలో... సాధారణ చికిత్సతో తగ్గే డయేరియా వల్ల కూడా మనుషులు చచ్చిపోతున్నారంటే ప్రాథమిక వైద్యం కూడా వారికి ఎంత దూరంలో ఉందో అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో ఆలస్యంగానే అయినా వీరి కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంది. ప్రభుత్వ సంకల్పాన్ని ‘ఎయిమ్స్’ ఆస్పత్రి అర్థం చేసుకుంది. ఫలితంగా బస్తర్ జిల్లాలోని అడవి బిడ్డలకు ఇప్పుడు హై క్లాస్ వైద్యం అందుతోంది! చత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఎయిమ్స్ ఉంది. ఇక్కడ అత్యుత్తమ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. అత్యాధునికమైన 900 బెడ్లు ఉన్న ఈ ఆస్పత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. తాజాగా ఇక్కడి నిపుణులు బస్తర్ జిల్లా ప్రజలకు వరంగా మారారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భారత ప్రభుత్వం వంద సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాంపు పరిధిలో 15 నుంచి 20 గ్రామాలుంటాయి. ఇవే ఆయా గ్రామాలకు వైద్యాలయాలు. అవి వైద్యాలయాలే గాని వైద్యులు మాత్రం ఆర్మీవాళ్లు కాదు లెండి. సాధారణంగా మొబైల్, ఇంటర్నెట్ వంటి ఏ సదుపాయాలకు ఈ గ్రామాలు నోచుకోవు. కానీ, సైన్యానికి ఉండే అవసరాల రీత్యా ఈ క్యాంపుల్లో మాత్రం అవి అందుబాటులో ఉంటాయి. అలా రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ వైద్య బృందం వారానికి రెండు రోజులు ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు ‘టెలిమెడిసిన్’ విధానంలో వైద్య చికిత్సలు అందిస్తోంది. ఇదెలా పనిచేస్తుందంటే... ఎయిమ్స్ కేంద్రంలోని వైద్య బృందాలు ఈ ఆర్మీక్యాంపుల్లో పనిచేసే పారామెడిక్, మెడికల్ అసిస్టెంట్లకు స్కైప్ ద్వారా కనెక్ట్ అవుతారు. వైద్యం కోసం వచ్చిన వారితో స్కైప్ ద్వారా వైద్యులు మాట్లాడతారు. వారి పరిస్థితిని నేరుగా వీడియోలో ప్రత్యక్షంగా చూసి లక్షణాలు తెలుసుకున్న అనంతరం స్థానికంగా ఉండే పారామెడిక్లకు ఎలా వైద్యం చేయాలో చెబుతారు. వారి సూచనలు ఫాలో అవుతూ పారామెడిక్‌లు రోగులకు చికిత్సలు చేస్తారు. అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ముందుగానే ఆర్మీక్యాంపుల్లో అందుబాటులో ఉంచడం వల్ల అక్కడికక్కడే వైద్యంతో పాటు మందులు కూడా వారికి అందుతున్నాయి. అయితే కొన్ని క్యాంపుల్లో ఇంటర్నెట్, మొబైల్ సదుపాయం కూడా ఉండదు. అక్కడ డీఎస్‌పీటీ (డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్) ద్వారా రోగులతో మాట్లాడుతారు. ఒకవేళ క్యాంపుల్లో నిర్వహించే వైద్య చికిత్సలతో రోగాలు తగ్గే పరిస్థితి లేనపుడు ఆర్మీయే రోగులను పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్తుంది. ఇదే వైద్య బృందం అక్కడి డాక్టర్ల ద్వారా అవసరమైన చికిత్సలు చేయిస్తుంది. ఈ వైద్యాలయాల నిర్వహణకు పూర్తి సహకారం అందేలా ఆర్మీకి భారత ప్రభుత్వం ఆదేశాలున్నాయి. వీటివల్ల చాలా వ్యాధులకు చికిత్సలు సకాలంలో అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నాయి. అడవి బిడ్డలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కుడోస్ టు టెక్నాలజీ, కుడోస్ టు టెలిమెడిసిన్!