చింతూరు (తూర్పుగోదావరి జిల్లా): ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని కొండగావ్ జిల్లాలో శనివారం సాయంత్రం పోలీసులకు, మావోరుుస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమిడి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రెస్క్యూ గార్డ్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్‌ల జవాన్లు కూంబింగ్‌కు వెళ్లినట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్‌ఆర్‌పీ కల్లూరి తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు నడుమ రెండు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఘటనాస్థలంలోని ఆనవాళ్లను బట్టి ఆరుగురు మావోయిస్టులు మృతిచెంది ఉంటారన్నారు. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఘటనాస్థలంలో మూడు 12 బోరు తుపాకులు, 12 కిట్‌బ్యాగులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నామని, పరారైన మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎదురుకాల్పుల్లో చాలామంది మావోయిస్టులు గాయపడినట్టు తెలిపారు.
ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్
Published Sat, Jun 6 2015 10:16 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement