ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..
చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు చనిపోగా, ఒకరిద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఎనిమిది మంది నక్సల్స్ చనిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment