పెరట్లో దొరికిన పుర్రె
సైబీరియా : రష్యాలోని లుజీనో గ్రామంలో ఊరి చివరన ఓ ముసలి జంట నివాసం ఉంటోంది. మహిళ(60) మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. ఓ రోజు బంగాళదుంప మొక్కలు నాటుదామని భావిస్తున్న ఆమె రెండో భర్త ఇంటి పెరట్లో తవ్వడంతో పుర్రె బయటపడింది. షాక్‌కు గురైన ఆయన మరికొంచెం లోతు తవ్వడంతో ఎముకలు కూడా బయటపడ్డాయి.
ఈ విషయాన్ని వెంటనే అతను భార్యకు తెలిపాడు. అయితే, ఆమె కంగారు పడొద్దని చెబుతూ ఆ అస్థికలు తన తొలి భర్తవని వెల్లడించింది. తరచూ అతను హింసిస్తుండటంతో 20 ఏళ్ల క్రితం గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపింది. పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని, అస్థికలను తిరిగి భూమిలో కప్పెట్టేయాలని కోరారు.
దాంతో ఒక్కసారిగా అతను హడలిపోయాడు. హుటాహుటిన పోలీసులను ఆశ్రయించాడు. మహిళను అరెస్టు చేయగా ఆమె నిజాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment