సాక్షి, ఖమ్మం: మితిమీరిన ఒత్తిడి భరించలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో ఓ పదో తరగతి విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన రంగు సౌజన్య(15) శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. పాఠశాలలో ఒత్తిడి కారణంగానే తమ కూతురు ఇంత పని చేసిందని.. ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment