సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో స్పెషల్‌బ్రాంచ్ ఎస్‌ఐ దారుణహత్యకు గురయ్యారు. ఇద్దరు ఆగంతకులు తుపాకీ లతో కాల్చి ఎస్‌ఐను హతమార్చారు. తమిళనాడు–కేరళ సరిహద్దుప్రాంతమైన కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై సమీపంలోని పడందాలూమూడు చెక్‌పోస్టులో బుధవా రం ఎస్‌ఐ విల్సన్(58) విధుల్లో ఉన్నారు. రాత్రి 9.25 గంటల సమ యంలో ఇద్దరు ఆగంతకులు చెక్‌పోస్టులోకి ప్రవేశించి ఎస్‌ఐపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. మూడు బుల్లెట్లు అతడి శరీరంలోకి దూసుకుపోయాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
అందుకే చంపారా?!
తమిళనాడులో దాడులకు పాల్పడేందుకు బెంగళూరులో దాక్కుని ఉన్న బెంగళూరుకు చెందిన మహమ్మద్ హనీఫ్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, మహ మ్మద్ సయ్యద్ అనే ముగ్గురు తీవ్రవాదులను క్యూబ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి మూడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వారిని చెన్నైకి తీసుకొచ్చి ఎగ్మూరుకోర్టులో ప్రవేశపెట్టి పుళల్ జైలుకు తరలించారు. దీనికి ప్రతీకారంగానే ఎస్‌ఐను చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విల్సన్‌కు భార్య ఏంజెల్‌మేరీ, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment