వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్
సాక్షి, కుసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అంటెండర్, డాక్యుమెంట్ రైటర్ సహాయకుడు పట్టుబడ్డారు. నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తీర్థాల కిరణ్ భార్య పేరుమీద ఉన్న భూమి డాక్యుమెంట్‌ను మార్చాలని కోరగా సబ్‌రిజిస్ట్రార్ రూ.5 వేలు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ అయిన అతను ధైర్యంగా వారికి విషయం చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేసి డబ్బు అడిగిన సబ్‌రిజిస్ట్రార్‌ను, ఆమె సూచనలతో డబ్బు తీసుకున్న డాక్యుమెంట్ రైటర్ సహాయకుడిని, అందుకు సహకరించిన అటెండర్‌ను ఆధారాలతో సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు..
రాంచంద్రాపురానికి చెందిన తీర్థాల కిరణ్ ఖమ్మం అర్బన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2016లో వ్యవసాయ భూమిలో 2వేల గజాలను పక్కా వ్యూహంతోనే.. ఏసీబీ అధికారులు కిరణ్‌కు వీడియో రికార్డర్‌ను అమర్చగా అతను అదేరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్‌తో రిజిస్ట్రేషన్‌పై ప్రస్తావించాడు. ఆమె రూ.5వేలు అడగటంతో చివరకు రూ.2వేలకు అంగీకరించి డాక్యుమెంటేషన్ చేయించాడు. వీరి మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేశారు. కిరణ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను తీసుకెళ్లేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం రాగా అతని వద్ద ఉన్న పది రూ.200 నోట్లను సబ్‌రిజిస్ట్రార్‌కు ఇవ్వబోగా ఆమె అటెండర్ జానీకి ఇవ్వమని సూచించారు.
జానీ నగదును డాక్యుమెంట్ రైటర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న కపిల్ అనే ప్రైవేటు వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో ఆ నగదును అప్పగించాడు. ఈ మొత్తాన్ని వీడియో రికార్డు చేయడంతో పాటు కిరణ్ ఇచ్చిన నోట్ల నంబర్‌లను రాసుకున్నారు. కపిల్ వద్ద తాము ఇచ్చిన నోట్లే లభించాయని ఏసీబీ డీఎస్పీ వివరించారు. దీంతో లంచం అడిగినందుకు సబ్ రిజిస్ట్రార్ ఉమాదేవిని, డబ్బు తీసుకున్న కపిల్‌ను, అందుకు ప్రేరేపించిన అటెండర్ జానీని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌లు రమణమూర్తి, ప్రవీణ్ (ఖమ్మం), సతీష్ (వరంగల్)పాల్గొన్నారు.
కన్వర్షన్ చేయించి పెట్రోల్ బంక్ కోసం తన భార్య మమత, తల్లి నాగమణి, వదిన శ్వేత పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో భార్య పేరు తొలగించి తన పేరు చేర్చి రీ డాక్యుమెంటేషన్ చేయాలంటూ గత నెల 19న కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవిని కలవగా అది ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్‌కు అభ్యతరం తెలిపారు. దీంతో కిరణ్ ఆర్టీఓ నుంచి కన్వర్షన్, నేలకొండపల్లి తహసీల్దారు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చాడు. అయినా సబ్ రిజిస్ట్రార్ తనకు రూ.5 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పటంతో గత నెల 30న ఏసీబీ డీఎస్పీకి విషయాన్ని తెలిపాడు.
మరెవరికీ ఇబ్బంది కలగొద్దని..:
భూమిని నా భార్యపేరు నుంచి మార్చుకోవాలంటే సబ్‌రిజిస్ట్రార్ అనేక ఇబ్బందులు పెట్టారు. రూ.5వేల లంచం అడిగారు. నా వలన కాదన్నా వినలేదు. మా నాన్నను కూడా ఇబ్బంది పెట్టారు. చివరకు రూ.2 వేలు కావాలన్నారు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని, నాలా ఎవరికీ ఇలా కావద్దని ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. కిరణ్, కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment