sub registrar arrested
-
వరంగల్ జిల్లాలో కలకలం రేపిన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా వ్యవహారం
-
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పుట్టపర్తి: బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి, సీఐ శాంతిలాల్ ప్రభాకర్ తెలిపిన మేరకు.. పుట్టపర్తి టౌన్ పరిధిలోని బ్రాహ్మణ పల్లికి చెందిన సురేంద్రరెడ్డి తన సోదరులతో పాటుగా ఉన్న ఉమ్మడి ఆస్తిలో తన వంతు భాగాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు. స్టాంప్ డ్యూటీ తగ్గించుకుంటామని, తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డీల్ కుదుర్చుకున్నాడు. బుధవారం రాత్రి సురేంద్రరెడ్డి అడ్వాన్స్‌గా సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్‌కు రూ.10 వేలు, అతని భార్యకు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. -
డాక్యుమెంట్ రైటర్లదే హవా..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగుల కంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్ల హవా నడుస్తోంది. డాక్యుమెంట్లు చేయడంతోపాటు ఆఫీసులో సైతం వారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చే వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నిరక్షరాస్యతతో పాటు విద్యావంతులు సైతం ఆన్లైన్లో సర్వే నంబర్ల పరిశీలన డాక్యుమెంట్ కోసం చేయాల్సిన పనులు తెలిసినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తుండంతో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోందని రియల్ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) 50 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు.. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు పెద్దపల్లిలో 20నుంచి 50 వరకు డాక్యుమెంట్లు మిగతా ప్రాంతాల్లో 10నుంచి 15వరకు డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ చేస్తుంటారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చాలావరకు వివరాల నమోదును ఆన్లైన్ చేసింది. అయితే ఆన్లైన్ వివరాల నమోదులోనూ డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆన్లైన్ పై సరైన అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున వసూలు చే స్తు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించిన డాక్యుమెంట్ రైటర్... పెద్దపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న ఒకరు.. గతంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ వద్ద తనమాట చెల్లకపోవడంతో సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీకి పట్టించాడు అయినప్పటికీ తిరిగి డాక్యుమెంట్ రైటర్‌గా కొనసాగుతుండడం విశేషం. అక్రమ వసూళ్లలో రిజిస్ట్రార్ కార్యాల య అధికారులు, సిబ్బందికి కూడా వాటాలు ముడుతుండడంతో అధికారుల వద్ద రైటర్ల హవా నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు మ్యుటేషన్ ఉచితమే... రిజిస్ట్రేషన్ సమయంలో మ్యుటేషన్ ఉచితంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చేస్తారు. కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారుల పేరుచెప్పి సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు మ్యుటేషన్ చేస్తా మని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ధరణి మాదిరిగా చేయాలి ధరణి మాదిరిగా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవినీతిని అరికట్టవచ్చని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తే అవకతవకలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు వసూలు చేస్తే చర్యలు మ్యుటేషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇలా ఎవరైనా అవినీతికి పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయి. డాక్యుమెంట్రైటర్లపై ప్రత్యేక దృష్టిసారించాం. – సురేశ్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, పెద్దపల్లి (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు: ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ జయరాజ్ కొంత కాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తోటి మహిళా ఉద్యోగిణి దిశా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. జయరాజ్ ను.. ఎన్నిసార్లు మందలించిన వినడంలేదని, వేధింపులు భరించలేకపోయాయని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి -
సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కొడిమి గ్రామ సర్వే నంబరు 227లో ఐదు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఇందులోని సెంటు స్థలానికి కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి ఐదు ఎకరాల స్థలంలో ఏకంగా వందకు పైగా డాక్యుమెంట్లను అక్రమంగా రిజిష్టర్ చేశారు. ఆయన అక్రమాల పర్వం అనంతపురం రూరల్ మండలానికే పరిమితం కాలేదు. కార్యాలయ పరిధిలోని రాప్తాడు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు మండలాలకూ విస్తరించింది. అందినకాడికి దండుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై.. సురేష్ ఆచారి అనంతపురం రూరల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా గత ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 13 వరకు పనిచేశారు. ఈ మధ్య కాలంలోనే అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ రిజిష్టర్ చేశారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123లోని 4.17 ఎకరాల వంక పోరంబోకును ఇతరుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ఈ నెల 1న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆ శాఖ డీఐజీ మాధవి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దీంతో సురేష్ ఆచారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల్లో 999 అక్రమ రిజిస్ట్రేషన్లు అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చట్ట సవరణ జరిగితేనే.. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించేలా చట్టంలో సవరణలు చేస్తేనే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తగ్గుముఖం పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అధికారులు కెమెరా కళ్లకు చిక్కకుండా అక్రమాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ సమయంలో సబ్‌రిజిస్ట్రార్ నిర్వహించే ప్రక్రియ అంతా రికార్డు అవుతుంది. క్రయ విక్రయదారులు అధికారి వద్దకు వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో కూడా రికార్డు అవుతుంది. కానీ సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో కార్యాలయం బయటే తతంగమంతా నడిపిస్తున్నారు. తద్వారా సీసీ కెమెరాలకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అక్రమాలను ఉపేక్షించం రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను తప్పుడు విధానంలో రిజిస్ట్రేషన్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రసన్నాయపల్లి సర్వే నంబరు 123–2లోని ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకే సబ్‌రిజిస్ట్రార్ సురేష్ ఆచారిని సస్పెండ్ చేశాం. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన హిందూపురం, ఉరవకొండ, చెన్నేకొత్తపల్లి సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం. –ఎన్.మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇవీ చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని.. వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, కుసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అంటెండర్, డాక్యుమెంట్ రైటర్ సహాయకుడు పట్టుబడ్డారు. నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తీర్థాల కిరణ్ భార్య పేరుమీద ఉన్న భూమి డాక్యుమెంట్‌ను మార్చాలని కోరగా సబ్‌రిజిస్ట్రార్ రూ.5 వేలు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ అయిన అతను ధైర్యంగా వారికి విషయం చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేసి డబ్బు అడిగిన సబ్‌రిజిస్ట్రార్‌ను, ఆమె సూచనలతో డబ్బు తీసుకున్న డాక్యుమెంట్ రైటర్ సహాయకుడిని, అందుకు సహకరించిన అటెండర్‌ను ఆధారాలతో సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ విలేకరులకు వెల్లడించిన వివరాల మేరకు.. రాంచంద్రాపురానికి చెందిన తీర్థాల కిరణ్ ఖమ్మం అర్బన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2016లో వ్యవసాయ భూమిలో 2వేల గజాలను పక్కా వ్యూహంతోనే.. ఏసీబీ అధికారులు కిరణ్‌కు వీడియో రికార్డర్‌ను అమర్చగా అతను అదేరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్ట్రార్‌తో రిజిస్ట్రేషన్‌పై ప్రస్తావించాడు. ఆమె రూ.5వేలు అడగటంతో చివరకు రూ.2వేలకు అంగీకరించి డాక్యుమెంటేషన్ చేయించాడు. వీరి మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేశారు. కిరణ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను తీసుకెళ్లేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం రాగా అతని వద్ద ఉన్న పది రూ.200 నోట్లను సబ్‌రిజిస్ట్రార్‌కు ఇవ్వబోగా ఆమె అటెండర్ జానీకి ఇవ్వమని సూచించారు. జానీ నగదును డాక్యుమెంట్ రైటర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న కపిల్ అనే ప్రైవేటు వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో ఆ నగదును అప్పగించాడు. ఈ మొత్తాన్ని వీడియో రికార్డు చేయడంతో పాటు కిరణ్ ఇచ్చిన నోట్ల నంబర్లను రాసుకున్నారు. కపిల్ వద్ద తాము ఇచ్చిన నోట్లే లభించాయని ఏసీబీ డీఎస్పీ వివరించారు. దీంతో లంచం అడిగినందుకు సబ్ రిజిస్ట్రార్ ఉమాదేవిని, డబ్బు తీసుకున్న కపిల్‌ను, అందుకు ప్రేరేపించిన అటెండర్ జానీని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, ప్రవీణ్ (ఖమ్మం), సతీష్ (వరంగల్)పాల్గొన్నారు. కన్వర్షన్ చేయించి పెట్రోల్ బంక్ కోసం తన భార్య మమత, తల్లి నాగమణి, వదిన శ్వేత పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో భార్య పేరు తొలగించి తన పేరు చేర్చి రీ డాక్యుమెంటేషన్ చేయాలంటూ గత నెల 19న కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవిని కలవగా అది ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్‌కు అభ్యతరం తెలిపారు. దీంతో కిరణ్ ఆర్టీఓ నుంచి కన్వర్షన్, నేలకొండపల్లి తహసీల్దారు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చాడు. అయినా సబ్ రిజిస్ట్రార్ తనకు రూ.5 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పటంతో గత నెల 30న ఏసీబీ డీఎస్పీకి విషయాన్ని తెలిపాడు. మరెవరికీ ఇబ్బంది కలగొద్దని..: భూమిని నా భార్యపేరు నుంచి మార్చుకోవాలంటే సబ్‌రిజిస్ట్రార్ అనేక ఇబ్బందులు పెట్టారు. రూ.5వేల లంచం అడిగారు. నా వలన కాదన్నా వినలేదు. మా నాన్నను కూడా ఇబ్బంది పెట్టారు. చివరకు రూ.2 వేలు కావాలన్నారు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని, నాలా ఎవరికీ ఇలా కావద్దని ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. కిరణ్, కానిస్టేబుల్ -
ఇంతకీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ?
మియాపూర్ భూ కుంభకోణం కేసు విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం రూ. 10వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం అక్రమాలకు సూత్రధారి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు. భూకుంభకోణం మొత్తం ఇతడి కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య ఇంద్రాణి, కోడలు మహిత, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. కుంభకోణం వెలుగులోకి రాగానే అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అతడి భార్య ఇంద్రాణి, కోడలు మహితలపై కూడా కేసులు నమోదయ్యాయి. ట్రినిటీ, సువిశాల సంస్థలలో డైరెక్టర్లంతా ప్రసాద్ కుటుంబ సభ్యులేనని తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ ప్రధాన కార్యాయలంలోనే ఈ రెండు సంస్థలు ఉన్నాయి. మెట్రో సంస్థ చెల్లించే పరిహారం కోసమే గోల్డ్‌స్టోన్ భూములను రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది. అమీరున్నీసా బేగంకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చి భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్లకు రూ. 50 కోట్ల వరకు లంచం ఇచ్చి 693 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రధాన నగరాల్లో ప్రసాద్ కోసం గాలింపు జరుగుతోంది. మరో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు ఇక ఇదే కేసులో బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మొత్తం ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భూమాఫియాకు వీరు ముగ్గురు సహకరించారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల మీద పోలీసులు దాడులు చేశారు. అప్లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. కిలో బంగారం స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ రవిచంద్రారెడ్డి ఇంటి మీద ఏసీబీ దాడులు చేసింది. ఈ సందర్భంగా కిలో బంగారం, రూ. 2 లక్షల నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన మియాపూర్ భూకుంభోకణంలో అరెస్టయ్యారు.