నెల్లూరు: భర్తను హతమార్చేందుకు భారీ సుపారీ ఇచ్చింది. ఈ అరుదైన సంఘటన నెల్లూరులో వెలుగులోకి వచ్చింది. ప్రియుడిపై ఉన్న మోజుతో భర్తను కడతేర్చేందుకు సాయిప్రియ అనే మహిళ దారుణమైన పథక రచన చేసింది. ప్రియుడు రవి సాయంతో భర్తను చంపేందుకు కొందరికి సుపారీ ఇచ్చింది. కాగా, తన హత్యకు పథక రచన జరిగిందన్న అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య సాయిప్రియ, ప్రియుడు రవిలు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.