టీడీపీ నాయకుడి చేతిలో గాయపడిన డ్రైవర్ మల్లికార్జున, పోలీసు స్టేషన్‌లో ఉన్న మనోహర్‌రెడ్డి
వైస్సార్ కడప, రాజంపేట : రాజంపేట పట్టణంలోని పాతబస్టాండులో తాడిపత్రి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయుడు దాడి చేశారు. ప్రయాణికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం తిరుపతి నుంచి తాడిపత్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం రాజంపేట పాతబస్టాండుకు చేరుకుంది. ఆ సమయంలో బస్సులోని ప్రయాణికులను దింపేందుకు డ్రైవరు ఎం.మల్లికార్జున బస్సు నిలిపాడు.
అయితే అదే సమయంలో ముందున్న టాటా సఫారీ వాహనాన్ని(ఏపీ04బీకె 3333) పక్కకు తీయమని పలుమార్లు హారన్ కొట్టాడు. దీంతో అందులో ఉన్న మనోహర్‌రెడ్డి దిగి బస్సువద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఎందుకు హారన్ కొట్టావంటూ డ్రైవర్‌ను దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పటికీ పోలీసులు ఫిర్యాదును తీసుకోవడంలో జాప్యం చేశారు. ఎట్టకేలకు దాడికి పాల్పడిన టీడీపీ నేత మనోహర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సాయంత్రం వరకు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment