కత్తులు, రాళ్లతో తెగబడిన టీడీపీ నేతలు | Tdp Leaders Murder Attempt On YSRCP Followers In Chittoor | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 4 2018 8:25 AM | Last Updated on Tue, Sep 4 2018 1:18 PM

Tdp Leaders Murder Attempt On YSRCP Followers In Chittoor - Sakshi

తవణంపల్లె: చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం  వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో ఉదయం ఉమాకాంత, శంకర్‌ అనే అతను వాదులాడుకొన్నారు. తర్వాత సద్దుమణిగారు. కృష్ణాష్టమి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు పూజలు చేయడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. గుడి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా శంకర్‌ వర్గీయులు ఇళ్ల పైనుంచి రాళ్లతో దాడి చేశారు. ఘర్ణణలో బాబు తలపై కత్తితో నరికి గాయపరిచారు. తవణంపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అసలు విషయమెమిటంటే..
తవణంపల్లె మండలంలోని కొత్త గొల్లపల్లె గ్రామస్థులు 2012 లో కృష్ణ మందిరం నిర్మించుకొన్నారు. ఆ తర్వాత గ్రామంలో చిన్న చిన్న తగువులు రావడంతో రెండు వర్గాలయ్యాయి. ఒక గ్రూపు తెలుగుదేశం పార్టీ వైపు, మరో గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. 2015 నుంచి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను వేరువేరుగా జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం వైఎస్సార్‌ సీపీ కి చెందిన వారికి అవకాశం వచ్చింది. దీంతో వారు ఆలయానికి రంగులు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం ఆలయానికి పూజా సామాగ్రి తీసుకొని వెళుతుండగా మహిళలు చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిపై రాళ్ళ వర్షం కురిపించారు. బైక్‌ వైపు వస్తున్న ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. ఘటనాస్థలి వైపు వచ్చిన వారిని  రాళ్లతో కొట్టారు. అప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులపై కూడా అధికార పార్టీ నేతలు దాడి చేశారు. ఎనిమిది మంది వైఎస్సార్‌ సీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా,  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురికి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అల్లర్లకు కారణమైన వారినే కాకుండా గాయాలపాలయిన వారిపై కూడా కేసులు నమోదుచేయడం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement