
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద బాధితుల పేరుతో టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆర్టిస్టులతో ప్రచారం చేయించింది. వీరంతా మంత్రిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర భాషలో, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి, ఐపీసీ సెక్షన్ 120 B కింద (కుట్రపూరిత) కేసు నమోదు చేశారు. ఈ వీడియో వెనుక నిర్మాత, దర్శకుడిని పోలీసులు గుర్తించారు. టీడీపీ అందించిన డబ్బులతోనే ఈ వీడియో నిర్మించినట్లు గుర్తించారు. వీడియో రికార్ట్ చేసిన ప్రాంతాన్ని సైతం పోలీసులు గుర‍్తించారు. ఈ కేసును డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment