paid artist
-
డబ్బులు తీసుకోలేదు.. ఫ్రీగా చేశా: మియా ఖలీఫా
ఎక్స్-పోర్న్‌స్టార్, ప్రయుఖ వెబ్‌కామ్ మోడల్ మియా ఖలీఫా మరోసారి వార్తల్లోకి నిలిచింది. క్యూబా అల్లకల్లోలంపై ఆమె చేసిన పోస్ట్‌తో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆమెపై విరుచుకుపడ్డాడు. మియాను ఓ క్యారెక్టర్‌లేని పర్సనాలిటీగా పేర్కొన్న మిగ్యుయెల్.. ఆమె ఒక అమెరికా పెయిడ్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్పందించింది. ‘ప్రజల పట్ల మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్న మీ తీరును ఇతరులకు తెలియజేయాలనే ఆ పని చేశా. నేనేం డబ్బులు తీసుకుని ఆ పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఆ పని అప్పజెప్పలేదు. నా పరిధిలో ఉచితంగా ఆ ట్వీట్ చేశా’ అంటూ ట్వీట్ ద్వారా బదులిచ్చింది ఆమె. అంతేకాదు క్యూబా అయినా, పాలస్తీనా అయినా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అంటూ మరో ట్వీట్ ద్వారా పేర్కొంది. ఇదిలా ఉంటే క్యూబా ప్రజల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు బైడెన్ మద్దతు తెలిపిన రోజే.. మియా ఖలీఫా ట్వీట్ చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దగ్గర ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ‘ఆమె అమెరికా చేతిలో కీలు బొమ్మ. క్యారెక్టర్ లేని వ్యక్తి. పెయిడ్ ఏజెంట్’ అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఇక మియాకు ఇలా ఇన్‌న్యూస్ విషయాలపై కొత్తేం కాదు. గతంలో పాలస్తీనా విషయంలో అమెరికా తప్పుల్ని సైతం వెలేత్తి చూపించిందామె. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ లెబనీస్-అమెరికన్ సెలబ్రిటీ.. తరచూ కొందరికి సాయం అందించడంతో పాటు ఇలా వివాదాల్లో కూడా నిలుస్తోంది. It’s tough not to see the faces of my people in the suffering of Cubans. Lebanon, Palestine, Cuba, it doesn’t matter where it’s happening, all that matters is it needs to be talked about because look at the result: PRESSURE forces change https://t.co/OG6QeEM7QL — Mia K. (@miakhalifa) July 15, 2021 -
అందరూ పెయిడ్ ఆర్టిస్టులేగా!
సాక్షి, అమరావతి : చంద్రబాబు అమరావతి పర్యటనకు తరలించిన జనమంతా డబ్బులిచ్చి తరలించిన వారేనంటూ ఆ పార్టీ నేతలు స్వయంగా చంద్రబాబుకు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజధాని పర్యటనలో తన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి చంద్రబాబు గురువారం బస్సులో బయల్దేరారు. ‘కార్యకర్తలకు టిఫిన్లు పెట్టారా?’ అంటూ బస్సులో తన ఎదురుగా ఉన్న ఒక టీడీపీ నేతను చంద్రబాబు ప్రశ్నించారు. ‘అంతా డబ్బులే’ అని ఆ నాయకుడు సమాధానమిచ్చారు. డబ్బులు ఇవ్వకుండా ఎవరు వస్తున్నారు అని ఆ నాయకుడు పేర్కొనగా.. ‘అంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లేగా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు ప్రతీ విషయంలో పెయిడ్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం రాజధానిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశావా? మరోవైపు చంద్రబాబు పర్యటనను రైతులు, కూలీలు, దళితులు అడుగడుగునా అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. బంగారంలా పండే తమ భూముల్ని లాక్కుని నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజధాని పేరుతో దగా చేశారని, బలవంతంగా భూములు తీసుకుని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు’ అంటూ దారిపొడవునా రైతులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాలుగేళ్లలో అద్భుతాలు చేస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని చంద్రబాబును నిలదీశారు. తమకు పంపిణీ చేసిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ దారిపొడవునా నినదించారు. ‘బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయి. మాకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో పర్యటించవద్దు’ అంటూ వెనక్కివెళ్లిపోవాలని ఆందోళనకు దిగారు. నాలుగేళ్లలో గ్రాఫిక్స్ పేరుతో కాలయాపన చేశారు తప్పితే వాస్తవంగా అమరావతిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశారా? అని ఆందోళనలో పాల్గొన్న రైతులు ప్రశ్నించారు. ‘ఈ ప్రాంతంలో ఏం నిర్మించావని చూడడానికి వస్తున్నారు? రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? యువత ఉపాధి కోసం ఇస్తానన్న రూ. 25 లక్షల వడ్డీలేని రుణం హామీ ఏమైంది? రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు?’ అని నిలదీశారు. జీవో 41తో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారని, పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారని పలువురు దళిత రైతులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు దళిత ద్రోహి. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వారి ప్రయోజనాల కోసం రాజధానిపై రాజకీయాలు చేయొద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు’ అని చంద్రబాబు కాన్వాయ్ వెళ్లిన ప్రతిచోట దారిపొడవునా నిలబడి ఆందోళన చేశారు. -
పెయిడ్ ఆర్టిస్టులకు పేమెంట్ లేదు..
సాక్షి, గుంటూరు: ఇటీవల కృష్ణా నదికి వరదలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది. వరదలను రాజకీయం చేయడానికి ఏ సాకూ దొరకని ప్రతిపక్ష టీడీపీ కుతంత్రానికి తెరదీసింది. ఓ పెయిడ్ ఆర్టిస్టుని పట్టుకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయించింది. చివరకు ఆ ఆర్టిస్టులు జైలు పాలయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా పల్నాడులోని ఆత్మకూరులో జరిగిన చిన్న వ్యక్తిగత ఘటనను భూతద్దంలో చూపించి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేసి, భంగపడింది. జరిగిన సంఘటనే చిన్నది కావడంతో టీడీనీ నాటకానికి గ్రామస్తులు నో చెప్పారు. గుంటూరులోని పునరావాస కేంద్రానికి రావడానికి అంగీకరించలేదు. దీంతో పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. అయితే, ఈ నాటకం పండలేదు. దీంతో ఆర్టిస్టులకు ఇస్తామన్న డబ్బులు ఎగ్గొట్టింది. దీంతో పనులు, కుటుం బాలను వదులుకొని వచ్చిన ఆ సామాన్యులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వైఎస్సార్సీపీ నాయకులు వేధిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. బాధితుల కోసమంటూ గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి మూడు రోజులు పునరావాస కేంద్రానికి పెద్దగా జనం రాలేదు. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామని చెబుతూ గ్రామాల్లో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ గొడవలు ఉన్నవారిని పునరావాస కేంద్రానికి తరలించారు. పిన్నెల్లి, ఆత్మకూరులో 125 మంది ఎస్సీలను వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేసి, వెళ్లగొట్టారని చంద్రబాబు ప్రచారం చేశారు. వాస్తవానికి పునరావాస కేంద్రంలో పిన్నెల్లి గ్రామం నుంచి వచ్చిన నలుగురు, ఆత్మకూరు నుంచి వచ్చిన 64 మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడా కుటుంబ సమస్యలు, టీడీపీ నేతలు ఇస్తామన్న డబ్బుకు ఆశపడి వచ్చినవారే. పెయిడ్ ఆర్టిస్టులతో వారం రోజులు నడిపిన పునరావాస నాటకం ముగిసింది. కానీ, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో పునరావాస కేంద్రం నుంచి వట్టి చేతులతో వెను తిరిగిన వారు తిట్టిపోస్తున్నారు. టీడీపీ నాయకులు నమ్మించి మోసం చేశారని మండిపడుతున్నారు. బయటకు రానివ్వలేదు నాయకులను చూద్దామని పునరావాస కేంద్రానికి వెళ్లాను. నాపై ఎలాంటి కేసులు లేవు. నేను పునరావాస కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చే సమయానికి పొద్దుపోయింది. మరుసటి రోజు వెళ్దాంలే అని అక్కడే పడుకున్నా. మరుసటి రోజు పొద్దున్నే మా గ్రామానికి వెళ్దామని బయల్దేరుతుండగా బయటకు రానివ్వకుండా గేట్లు వేసేశారు. – నరసింహారావు, పిడుగురాళ్ల డబ్బులివ్వకుండా మోసం చేశారు ఆసుపత్రిలో పని ఉంటే గుంటూరు వెళ్లాను. పునరావాస కేంద్రంలో ఉన్న నా స్నేహితుడు ఫోన్ చేసి భోజనాలు పెడుతున్నారని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లాను. భోజనం చేశాక ఇక్కడే ఉంటే డబ్బులు ఇస్తామన్నారు. అక్కడే ఉన్నా టీడీపీ నేతలు మాకు ఇస్తామన్న రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేశారు. – కొమ్ము ఏసుబాబు, పిన్నెల్లి గ్రామం -
పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తప్పుడు ప్రచారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో పలుచన చేయడమే కుట్రదారుల ఉద్దేశమని భావిస్తున్నారు. ఒకవైపు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉంటే మరోవైపు టీడీపీ పనిగట్టుకుని బురద రాజకీయం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టులను వాడుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వినియోగించిన జూనియర్ ఆర్టిస్టులను, పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం సాగించారు. టీడీపీ పెద్దల డైరెక్షన్లో రెచి్చపోయిన పెయిడ్ ఆర్టిస్టులు ఏకంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించారు. కుల వృత్తిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల తీరుపై యాదవ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తొలుత విజయవాడ సత్యనారాయణపురం, కృష్ణా జిల్లా తిరువూరు, ఎ.కొండూరు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గుంటూరు, ఉభయ గోదావరి, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ఒక కులాన్ని, వృత్తిని కించపరచడంతోపాటు వ్యక్తిగత దూషణలు చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్‌లపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక ఎవరున్నారన్న దానిపై తీగ లాగుతున్నారు. గుట్టు బయటపెట్టిన శేఖర్ చౌదరి టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు కుడితిపూడి శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడు ఇచ్చిన సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా శేఖర్ చౌదరి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని గుట్టు విప్పినట్టు ప్రచారం సాగుతోంది. తమలాంటి వారికి నెలవారీగా వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి వాడుకుంటున్నారని వివరించినట్టు తెలిసింది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలతో ఆడియోలు, వీడియోలు రూపొందిస్తున్నామని శేఖర్ చౌదరి అంగీకరించాడు. టీడీపీ నేతలే నిర్మాతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడానికి టీడీపీ నేతలే డబ్బులు సమకూరుస్తున్నారని శేఖర్ చౌదరి వెల్లడించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తెరవెనుక భారీ కుట్ర జరుగుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. దీని వెనుక ఎంతటి బడా బాబులున్నా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
గుట్టువిప్పిన శేఖర్ చౌదరి...
సాక్షి, విజయవాడ: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో టీడీపీ ప్రముఖుల పేర్లను అతడు చెప్పినట్లు సమాచారం. తీగ లాగితే డొంక కదులుతున్నట్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని శేఖర్‌చౌదరి గుట్టువిప్పినట్టు సమాచారం. చదవండి: పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్ టీడీపీ కోసం పనిచేసే తమలాంటి వారికి నెలవారీ వేతనాలు ఇచ్చి ప్రభుత్వంపై విమర్శలను రక్తికట్టించేలా వాడుకుంటున్నారని వివరించినట్టు తెలిసింది. ప్రతి విషయంలోను ప్రభుత్వంపై లేనిపోని విమర్శలతో ఆడియో, వీడియోలను రూపొందిస్తున్నామని అంగీకరించాడు. ప్రభుత్వంపై చేసే విమర్శలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మేలా చేసేందుకు సినీరంగానికి చెందిన కొందరు తమకు స్క్రిన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలోని తమలాంటి టీమ్‌లకు, సినీరంగానికి చెందిన వారికి టీడీపీ నేతలే నిర్మాతలు అని పేర్లు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మంత్రులను అభాసుపాలు చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పెయిడ్ ఆర్టిస్టులకు కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం వహించిన వెనక ఉండి నడిపిస్తున్న టీడీపీ పెద్దల ఎవరనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బట్టబయలైన టీడీపీ సోషల్ మీడియా కుట్ర
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద బాధితుల పేరుతో టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆర్టిస్టులతో ప్రచారం చేయించింది. వీరంతా మంత్రిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర భాషలో, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి, ఐపీసీ సెక్షన్ 120 B కింద (కుట్రపూరిత) కేసు నమోదు చేశారు. ఈ వీడియో వెనుక నిర్మాత, దర్శకుడిని పోలీసులు గుర్తించారు. టీడీపీ అందించిన డబ్బులతోనే ఈ వీడియో నిర్మించినట్లు గుర్తించారు. వీడియో రికార్ట్ చేసిన ప్రాంతాన్ని సైతం పోలీసులు గుర్తించారు. ఈ కేసును డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
పెయిడ్ ఆర్టిస్ట్ వెనుక ఉన్నదెవరో బయటకు తెస్తాం
సాక్షి,అమరావతి/పట్నంబజారు(గుంటూరు): టీడీపీకి చెందిన జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ విషయమై మరోసారి గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతూ.. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ కులాన్ని దూషించిన కుడితిపూడి శేఖర్‌చౌదరి చేసిన వీడియోపై ఫిర్యాదు చేశారు. మరో 3 రోజుల్లో పెయిడ్ ఆర్టిస్టును అరెస్ట్ చేసి దీనికి వెనుక ఎవరున్నారో వివరాలన్నీ బయటకు తీస్తామని డీజీపీ అన్నారు. శేఖర్‌చౌదరిపై మరో ఫిర్యాదు సీఎం వైఎస్ జగన్, అనిల్‌కుమార్‌యాదవ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శేఖర్‌చౌదరిపై గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంట లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
'పవన్.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువా ?'
సత్యనారాయణపురం (విజయవాడ): 'పవన్ కల్యాణ్.. నువ్వు సినీ ఆర్టిస్టా లేక పెయిడ్ ఆర్టిస్టువా..' అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో 35 రోజుల తర్వాత స్పందించిన పవన్.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివారని విమర్శించారు. దీనికి నిర్మాత, దర్శకుడు, సంగీతం, మాటలు ఎవరో అర్థమవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు స్టీఫెన్సన్కు ఫోన్ చేయడం నేరం కాదా ? ఆ ఫోన్ సంభాషణలని స్టీఫెన్సన్ రికార్డు చేయడం నేరమా ? అని నిలదీశారు. గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి ఓటుకు కోట్లు వ్యవహారంపై ఏమీ చెప్పక పోవడం సిగ్గుచేటన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ మాట దివాలాకోరు వాదనగా గౌతమ్‌రెడ్డి అభివర్ణించారు.