పెయిడ్‌ ఆర్టిస్ట్‌ వెనుక ఉన్నదెవరో బయటకు తెస్తాం | AP Government Chief Digital Complaint To DGP Against TDP Paid Artist | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ ఆర్టిస్ట్‌ వెనుక ఉన్నదెవరో బయటకు తెస్తాం

Published Fri, Aug 23 2019 8:42 AM | Last Updated on Fri, Aug 23 2019 2:14 PM

AP Government Chief Digital Complaint To DGP Against TDP Paid Artist - Sakshi

సాక్షి,అమరావతి/పట్నంబజారు(గుంటూరు): టీడీపీకి చెందిన జూనియర్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ విషయమై మరోసారి గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతూ.. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కులాన్ని దూషించిన కుడితిపూడి శేఖర్‌చౌదరి చేసిన వీడియోపై ఫిర్యాదు చేశారు. మరో 3 రోజుల్లో పెయిడ్‌ ఆర్టిస్టును అరెస్ట్‌ చేసి దీనికి వెనుక ఎవరున్నారో వివరాలన్నీ బయటకు తీస్తామని డీజీపీ అన్నారు.

శేఖర్‌చౌదరిపై మరో ఫిర్యాదు 
సీఎం వైఎస్‌ జగన్, అనిల్‌కుమార్‌యాదవ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శేఖర్‌చౌదరిపై గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంట లీగల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement