
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ముగ్గురిపైకి ఆర్టీసి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ముగ్గురిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.