సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మైలార్‌దేవుపల్లి పరిధి వడ్డేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి అత్తా, కోడలిని దారుణంగా నరికి చంపారు. అత్త నబీనాబేగం(55), కోడలు తాయబ్(25) హత్యకు గురయ్యారు. తాయబ్ భర్త రాత్రి విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గల కారణం తెలియరాలేదు.మృతులు నిజామాబాద్ జిలా కోటగిరికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment