
పూణే : లిఫ్ట్ ఇస్తామని చెప్పి తమ బైక్‌పై ఎక్కించుకున్న ఉగాండా యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన పూణేలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి కొరేగావ్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపల వేచిచూస్తున్న మహిళను బైక్‌పై వచ్చిన వ్యక్తి మాటల్లోకి దింపాడు. ఆమె బైక్ ఎక్కేందుకు సమ్మతించగా మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి ముగ్గురూ కలిసి బయలుదేరారు. మహిళను ఆమె ఇంటివద్ద దింపకుండా వేరే మార్గంలోకి బైక్‌ను మళ్లించి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుపై ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment