ప్రమాద స్థలం
సాక్షి, వరంగల్ (అర్బన్): భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో పేలుడు ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌కు బాణాసంచా తయారీకి పర్మిషన్ లేదని తెలిపారు. 2017లోనే దీని పర్మిట్ ముగిసిందని అన్నారు.
పర్మిషన్ లేకుండా పేలుడు పదార్థాలు విక్రయించడం, తయారు చేయడం క్రిమినల్ చర్య అని అన్నారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment