సాక్షి, చెన‍్నై : అప్పుల బాధతోనే తల్లి, భార్య, పిల్లల గొంతుకోసి చంపి, తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పమ్మల్‌కు చెందిన పారిశ్రామికవేత్త దామోదరన్ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. చెన్నై పమ్మల్ తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త దామోదరన్ ఈనెల 12వ తేదీన తల్లితోపాటు భార్య, పిల్లలను హతమార్చి తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇలావుండగా దామోదరన్ ప్రస్తుతం చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిగురించి దామోదరన్ మామ బాలకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంకర్‌నగర్ పోలీసులు దామోదరన్‌పై హత్య కేసు, ఆత్మహత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న దామోదరన్ వద్ద చెన్నై జార్జి టౌన్ మేజిస్ట్రేట్ వడివేలు బుధవారం రహస్య వాంగ్మూలం సేకరించారు. ఆ సమయంలో దామోదరన్ మాట్లాడుతూ అప్పుల బాధతో తనకు జీవితంపై విరక్తి ఏర్పడిందని, దీంతో కుటుంబంతోపాటు ఆత్మహత్య చేసుకోడానికి నిర్ణయించిన ట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment