damodaran
-
రిస్క్‌ను ఎదుర్కొనడం కంపెనీ డీఎన్ఏలోనే ఉండాలి
న్యూఢిల్లీ: రిస్కులను ఎదుర్కోవడమనేది కంపెనీల రోజువారీ డిఎన్ఏలోనే ఉండాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. రిస్కులనేవి పెద్ద కంపెనీలకే కాదని, చిన్న సంస్థలూ వీటిని ఎదుర్కోవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడల్ రిస్క్ కోడ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిస్క్‌ల నిర్వహణలో ఈ కోడ్ ఆచరణాత్మక సాధనం (టూల్ కిట్) వంటిదని దామోదరన్ పేర్కొన్నారు. దేశీ పరిశ్రమల పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (జీఆర్ఎంఈ) కలిసి దీనికి రూపకల్పన చేశాయి. దామోదరన్ సారథ్యంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఈ కోడ్‌ను తీర్చిదిద్దింది. కోడ్ ప్రధానంగా రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించిన కీలక మూలసూత్రాలు, రిస్క్ నిర్వహణను అమలు చేయడం అనే రెండు కీలక అంశాల ఆధారంగా రూపొందింది. ఇది వ్యాపారాల నిర్వహణలో మార్గదర్శిగా నిలవడంతోపాటు.. అన్ని విభాగాలలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంలో తోడ్పాటునిస్తుంది. కోడ్ ప్రధానంగా లిస్టెడ్, పబ్లిక్ అన్‌లిస్టెడ్, ప్రయివేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లను ఉద్ధేశించి రూపొందించారు. -
చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం
సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్ దామోదరన్ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు. -
బ్యాంకుల దుస్థితికి రాజకీయ నేతలే కారణం
పుణే: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు ఢిల్లీ రాజకీయ నేతలే కారణమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు పీఎస్‌బీలను ప్రైవేటీకరించడమనేది సరైన పరిష్కార మార్గం కానే కాదన్నారు. ఆర్బీఐ నిర్వహణలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ (రాజకీయ నేతల) నుంచి ముంబైకి (పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలున్న ఆర్థిక రాజధాని) వస్తున్న ఫోన్ కాల్సే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి మూలం. ముంబైలోని వారు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు‘ అని దామోదరన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను సమర్థిస్తూ.. మొండిబాకీల సమస్యను సరిదిద్దాలంటే ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ తగిన పరిష్కారమార్గం కాదని చెప్పారు. నిజాయితీకి ’ప్రైవేట్’ పర్యాయపదమేమీ కాదు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్య సంబంధమైన, విభిన్నమైన పాలనా సంబంధమైన అంశాలే వాటి సమస్యలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిదీ ప్రైవేటీకరించాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే.. ప్రైవేటీకరణ అనేది నిజాయితీకి, సమర్థతకు పర్యాయపదమేమీ కాదనడానికి నిదర్శనంగా ఇటీవల పలు ఉదంతాలు కనిపిస్తున్నాయి‘ అని దామోదరన్ చెప్పారు. ప్రశ్నార్థకమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలతో ప్రైవేట్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం వంటి విభిన్న దేశంలో పటిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ‘యాజమాన్య అధికారం ఉంది కదా అని మేనేజ్మెంట్ కూడా చేయొచ్చని ప్రతీ లావాదేవీ తమ ఆదేశాల ప్రకారమే జరగాలనుకున్న పక్షంలో అలాంటి యాజమాన్యం వల్ల సమస్యలు తప్పవు. ప్రైవేటీకరణ చాలా గొప్పదని అనుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సమస్యలు లేని అద్భుతమైన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అనేకం ఉన్నాయి‘ అని దామోదరన్ పేర్కొన్నారు. -
కుటుంబాన్ని ఎందుకు హతమార్చానంటే...
సాక్షి, చెన్నై : అప్పుల బాధతోనే తల్లి, భార్య, పిల్లల గొంతుకోసి చంపి, తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పమ్మల్‌కు చెందిన పారిశ్రామికవేత్త దామోదరన్ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. చెన్నై పమ్మల్ తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త దామోదరన్ ఈనెల 12వ తేదీన తల్లితోపాటు భార్య, పిల్లలను హతమార్చి తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇలావుండగా దామోదరన్ ప్రస్తుతం చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిగురించి దామోదరన్ మామ బాలకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంకర్‌నగర్ పోలీసులు దామోదరన్‌పై హత్య కేసు, ఆత్మహత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న దామోదరన్ వద్ద చెన్నై జార్జి టౌన్ మేజిస్ట్రేట్ వడివేలు బుధవారం రహస్య వాంగ్మూలం సేకరించారు. ఆ సమయంలో దామోదరన్ మాట్లాడుతూ అప్పుల బాధతో తనకు జీవితంపై విరక్తి ఏర్పడిందని, దీంతో కుటుంబంతోపాటు ఆత్మహత్య చేసుకోడానికి నిర్ణయించిన ట్లు తెలిపారు. -
అమ్మా.. మజాకా!
పార్టీపై ప్రత్యేక నిఘా నిర్లక్ష్యపు మంత్రులపై వేటు మాజీలకు చోటు చెన్నై, సాక్షి ప్రతినిధి : మంత్రులపై వేటు, మాజీ మంత్రులకు చోటు ఇవ్వడం ద్వారా అమ్మా...మజాకా! అని మరోసారి రుజువుచేసుకున్నారు. అమ్మ మార్కు రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించి పలువురి పార్టీ పదవులపై వేటు వేశారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు నూరిపోశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. 37 స్థానాల్లో గెలవగా కన్యాకుమారి, ధర్మపురి, పుదుచ్చేరి స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశమంతా అన్నాడీఎంకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేసినా అమ్మ మాత్రం ఆ మూడు స్థానాలపై ఆలోచనలో పడ్డారు, తనదైన శైలిలో ఆరాతీశారు. అంతే ఇంకేముంది ముగ్గురు మంత్రులపై వేటుపడింది. కొందరు పార్టీ పదవులను కోల్పోయారు. కన్యాకుమారిలో అన్నాడీఎంకే అభ్యర్థి మూడోస్థానానికి దిగజారడంతో అక్కడి ఇన్చార్జ్ మంత్రి పచ్చయమ్మాల్ పదవి కోల్పోయారు. ఈరోడ్ ఇన్చార్జ్ మంత్రి దామోదరన్ అనారోగ్యం పేరున సరిగా ప్రచారం చేయకపోవడం, అభ్యర్థుల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా పంచకపోవడంతో మాజీగా మారిపోయారు. తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినా అక్కడి ఇన్చార్జ్ మంత్రి బీవీ రమణకు వేటుతప్పలేదు. ఇది పార్టీలో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. రమణ తొలగింపునకు సరైన కార ణాలను పార్టీ నేతలే అన్వేషిస్తున్నారు. అమ్మ కేబినెట్లో కీలక పోర్టుఫోలియోలను నిర్వర్తిస్తున్న కేపీ మునుస్వామి నుంచి తప్పించి సాధారణమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించి చివరకు ఆ శాఖనుంచి కూడా తొలగించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొన్నా తగిన నివారణ చర్యలను తీసుకోలేదన్న ఆరోపణ వుంది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్న మంత్రి కేపీ మునుస్వామిని తప్పించి ఎడప్పాడీ పళనిసామిని నియమించారు. కన్యాకుమారి, ధర్మపురిల్లో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నవారిపై కూడా జయ వేటువేశారు. మాజీలకు మళ్లీ చోటు సక్రమంగా పనిచేయనివారిపైనే కాదు సమర్థవంతంగా వ్యవహరించిన నేతలపైనా తన నిఘా ఉందని అమ్మ నిరూపించుకున్నారు. గతంలో మంత్రి పదవుల నుంచి తొలగింపునకు గురైన వేలుమణి, అగ్రి కృష్ణమూర్తి, గోకుల ఇందిర ఈ ముగ్గురు తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు మెచ్చుకోలుగా అమ్మ మళ్లీ పదవులను కట్టబెట్టారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.రోశయ్య సీఎం జయ సమక్షంలో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
పాత డీల్స్‌పై పన్నుల విధింపు సరికాదు
న్యూఢిల్లీ: గత కాలపు లావాదేవీలపై సైతం పన్నులు వడ్డించే(రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్) విధానాలు సరికాదని ప్రభుత్వం నియమిం చిన ఓ కమిటీ అభిప్రాయపడింది. ఇండియాలో బిజినెస్‌లను ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు, వ్యక్తులకు ఇది నిరాశను కలిగిస్తున్నదని వ్యాఖ్యానించింది. దే శీయంగా వ్యాపారాల నిర్వహణను ప్రోత్సహించే బాటలో అనువైన , సులభమైన వాతావరణాన్ని కలిగించాల్సి ఉన్నదని తెలి పింది. ఇందుకు వీలుకల్పిస్తూ చట్టబద్దమైన, పాలనాపరమైన, నియంత్రణలకు సంబంధిం చిన అంశాలలో సంస్కరణలను తీసుకురావాలని వివరించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదికను కార్పొరేట్ వ్యవహారాల శాఖకు అందించనుంది. గందరగోళానికి తావులేని విధంగా నిబంధనలను సరళం చేయాల్సి ఉన్నదని సూచించింది.