పాత డీల్స్‌పై పన్నుల విధింపు సరికాదు | Retrospective taxation hurts business environment: Panel | Sakshi
Sakshi News home page

పాత డీల్స్‌పై పన్నుల విధింపు సరికాదు

Published Mon, Sep 16 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

పాత డీల్స్‌పై పన్నుల విధింపు సరికాదు

పాత డీల్స్‌పై పన్నుల విధింపు సరికాదు

న్యూఢిల్లీ: గత కాలపు లావాదేవీలపై సైతం పన్నులు వడ్డించే(రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్) విధానాలు సరికాదని ప్రభుత్వం నియమిం చిన ఓ కమిటీ అభిప్రాయపడింది. ఇండియాలో బిజినెస్‌లను ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు, వ్యక్తులకు ఇది నిరాశను కలిగిస్తున్నదని వ్యాఖ్యానించింది. దే శీయంగా వ్యాపారాల నిర్వహణను ప్రోత్సహించే బాటలో అనువైన , సులభమైన వాతావరణాన్ని కలిగించాల్సి ఉన్నదని తెలి పింది. 
 
 ఇందుకు వీలుకల్పిస్తూ చట్టబద్దమైన, పాలనాపరమైన, నియంత్రణలకు సంబంధిం చిన అంశాలలో సంస్కరణలను తీసుకురావాలని వివరించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదికను కార్పొరేట్ వ్యవహారాల శాఖకు అందించనుంది. గందరగోళానికి తావులేని విధంగా నిబంధనలను సరళం చేయాల్సి ఉన్నదని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement