
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తాళపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఉదయాన్నే పొలానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన దంపతులు విశాఖలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమినాయుడు(55), కరణం పైడితల్లి(50)గా పోలీసులు గుర్తించారు. కాగా లారి డ్రైవర్ పరారీలో ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment