నాగ చిరంజీవి (ఫైల్)
నర్సీపట్నం: విద్యుత్‌షాక్‌కు గురై విద్యార్థి దుర్మరణం చెందాడు. పట్టణంలోని పాతసంతబయలు వీధికి చెందిన బోయిన నాగ చిరంజీవి(14) స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి శ్లాబ్ నానిపోయింది. ఎర్త్ వైర్ ద్వారా ఇంటి మొత్తానికి విద్యుత్ ప్రసరిస్తోంది. దీనిని ఎవరు గమనించలేకపోయారు. దుస్తులు ఆరబెట్టేందుకు శ్లాబ్ ఊచకు బయట రాటకు ఇనుప తీగె కట్టారు. ఆ వైరును శనివారం రాత్రి విద్యార్థి చిరంజీవి పట్టుకోవడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పాతసంతబయలుకు చెందిన బోయిన శ్రీనివాసరావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకుమార్తెకు వివామమైంది. రెండో కుమారుడు నాగచిరంజీవి. కళ్లెదుటే కుమారుడిని విద్యుత్‌షాక్ రూపంలో మృత్యువు కబలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విద్యార్థి మృతితో పాతసంతబయలు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో రైతు..
అచ్యుతాపురం: కొండకర్లకు సమీపంలో ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసుపులేటి రమణబాబు (50) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ తారకేశ్వరరావు కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. యలమంచిలి మండలం పులపర్తి లోఅత్తవారి ఇంటికి వెళ్లిన రమణబాబు తిరిగి భార్య లక్ష్మితో మునగపాక మండలం ఒంపోలు పేటకు బైక్‌పై బయలుదేరాడు. కొండకర్ల సమీ పం లో ఎదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీకొంది. ప్రమాదంలో రమణబాబు తలకు తీవ్ర గాయమైంది. అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య లక్ష్మి తీవ్రంగా గాయç ³డింది. ఢీకొట్టిన బైక్‌కు చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
లారీ అదుపు తప్పి డ్రైవర్ మృతి
నక్కపల్లి: జాతీయరహదారిపై కాగిత టోల్‌గేట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఎస్‌ఐ సింహాచలం కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. తుని వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందున్న ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. డ్రైవర్ ఇబ్రహీం క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. చిలుకలూరిపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment