నిందితురాలు జునైతా
మెక్సికో : గర్భంతో ఉన్న ఓ యువతిని దారుణంగా హత్య చేయటమే కాకుండా.. కడుపులోని శిశువును బయటకు తీసి అతి క్రూరంగా ప్రవర్తించిందో మహిళ. ఈ సంఘటన మెక్సికోలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం మెక్సికో, సోలిడరిడాడ్‌కు చెందిన జునైతా అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల గర్భిణిని తన ఇంటికి పిలిచింది. అనంతరం యువతిని బంధించి, బండరాయితో తలను పగులగొట్టింది. ఆ తర్వాత కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపి, కడుపులోని ఏడు నెలల బిడ్డను బయటకు తీసింది. ఆ వెంటనే పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లింది. ( వైజాగ్ యువతిది హత్యే! )
ఆ బిడ్డ తన బిడ్డేనని అక్కడి వారికి అబద్ధం చెప్పింది. నెలలు నిండని పసికందు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం అందించి రక్షించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డ ఆమెది కాదని అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. జునైతాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. పిల్లలు పుట్టని తనను భర్త వదిలేస్తాడేమోనన్న భయంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. పోలీసులు హత్యానేరం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment