
మలక్‌పేట: నాలుగో తరగతి వరకు కలిసి చదువుకున్న క్లాస్‌మేట్‌ను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని లోబరుచుకుని తుదకు ముఖంచాటేసిన యువకుడి ఉదంతమిది. ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట ముంతాజ్ కాలేజ్ సమీపంలోని క్వార్టర్స్‌లో నివసించే యువతి (23) స్థానిక మెథడిస్ట్ సూల్‌లో 4వ తరగతి వరకు చదువుకుంది. బడంగ్‌పేటకు చెందిన శివకుమార్‌రెడ్డి (28) కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చాలా కాలం తర్వాత సదరు యువతిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2018లో ఏప్రిల్ 10న శివకుమార్‌రెడ్డి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత నెల నుంచి అతడి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రాసాగింది. ఆరా తీయగా గత జనవరి 14న అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. యువతి నిలదీయడంతో తనను మర్చిపోవాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు గురువారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment