
బొమ్మనహళ్లి (బెంగళూరు): ఆరుగురు నేపాల్ యువకులు తమ దేశానికే చెందిన యువతికి మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బండరాయితో మోది గాయపరిచారు. బెంగళూరు శివార్లలోని అనేకల్ పక్కన ఉన్న అవడదేవహళ్లి గ్రామంలో ఈ ఘోరం శనివారం వెలుగుచూసింది. అనేకల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఉండే ఆరుగురు నేపాలీ యువకులు నేపాలీ యువతికి పని చూపిస్తామని మభ్యపెట్టి గురువారం గ్రామంలోని ఒక పాత భవనంలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. శుక్రవారం రాత్రి వరకు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఘోరం బయటకు రాకూడదని ఆమెను చంపాలని బండరాయితో కొట్టి పరారయ్యారు.
శనివారం ఉదయం తీవ్ర గాయాలతో బయటకు వచ్చిన యువతిని చూసిన ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పారిజాత, శంకర్‌లు అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ బాధితురాలిని కలసి వివరాలు సేకరించారు. దుండగులు పరారీలో ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment