
చోడవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుతున్న మేరీ
విశాఖపట్నం, చోడవరం టౌన్: తనను పెళ్లి చేసుకుని, కొన్నాళ్లు కాపురం చేసిన స్థానిక ఆంధ్రబ్యాంకు వీధికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామానికి చెందిన ఎద్దుమేరీ అనే మహిళ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. ఆమె తన ముగ్గురు పిల్లలతో ఇక్కడకు వచ్చి, నిరసన తెలిసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తన భర్త ఎలియేష్ అనారోగ్యంతో ఐదేళ్లు క్రితం మృతి చెందాడని చెప్పింది. చోడవరంలోని ఆంధ్రా బ్యాంకు రోడ్డు వీధికి చెందిన ఎడ్ల సంతోష్ కొంతకాలం నంద్యాలలోని ఓ హోటల్‌లో పనిచేశాడని తెలిపింది. అక్కడే పనిచేసిన తనకు సంతోష్ పరిచయమయ్యాడని, పది నెలల క్రితం తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తరువాత మాడుగుల మండలం కోటపాడులో కాపురం పెట్టాడని, ఇప్పుడు ముఖం చాటేశాడని చెప్పింది. తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగింది. దీనిపై ఎస్‌ఐ రామకృష్ణను వివరణ కోరగా మేరీ ఫిర్యాదు చేయలేదని, చేస్తే కేసు కోటపాడు స్టేషన్‌కి రిఫర్ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment