![Women Committed Suicide In Khammam - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/19/uyt.jpg.webp?itok=K-sg7HzU)
సాక్షి, పెనుబల్లి: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మల్లీశ్వరి, ధరావత్ లక్ష్మణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత లక్ష్మణ్ మరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడనే విషయంపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో గొడవలు తీవ్రమై 15 రోజులుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. శనివారం ఉదయం తను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు మల్లీశరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతురాలి తల్లి వీఎంబంజర్ పోలీసులకు తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ తోట నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మల్లీశ్వరి మృతదేహానికి పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment