పుట్టిన రోజు వేడుకని పిలిచి...  | Young Men Molested Girl Over Birthday Party In Orissa | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు వేడుకని పిలిచి... 

Published Thu, Jun 18 2020 7:50 AM | Last Updated on Thu, Jun 18 2020 7:51 AM

Young Men Molested Girl Over Birthday Party In Orissa - Sakshi

చాపరలో విచారణ చేపడుతున్న డీఎస్పీ రారాజు ప్రసాద్‌    

భువనేశ్వర్‌ : బాలిక(13)పై కన్నేసిన ఇద్దరు యువకులు పుట్టిన రోజు వేడుకకని పిలిచి, మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో బుధవారం సాయంత్రం పాతపట్నం సీఐ ఆర్‌ రవిప్రసాద్, ఎస్‌ఐ సిద్ధార్థ కుమార్‌లతో కలిసి పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్‌ విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేస్తామని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో తన అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గుగ్గిలాపు రామారావు, గుగ్గిలాపు రవి అనే యువకులు ఆ బాలికతో స్నేహం పెంచుకున్నారు. పుట్టిన రోజు వేడుక జరుపుకుందామని తమ ఇంటికి పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టారు.

అయితే మత్తు నుంచి స్పృహ రావడంతో అక్కడ ఇద్దరూ లేకపోవడంతో వెళ్లిపోయింది. కొద్ది నెలల తర్వాత తాను గర్భం దాల్చినట్లు తెలుసుకుని, అందుకు కారణమైన వారిని ప్రశ్నించింది. దీంతో గర్భస్రావం కావడానికి మాత్రలు మింగించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. మాత్రలు వేసుకున్న తర్వాత విపరీతమైన రక్తస్రావం కావడంతో ఆమె అమ్మమ్మ పాపమ్మకు విషయాన్ని తెలియజేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ సిద్ధార్థకుమార్‌ కేసు నమోదు చేసి, బాలికను పాతపట్నం సీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement