దుర్గాప్రసాద్‌ను కొడుతున్న దుండగులు (అంతర చిత్రం) దుర్గాప్రసాద్ (ఫైల్)
అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి వచ్చాడు.. ఇంట్లో దుర్గామాత పూజ చేసుకొని ఆటల పోటీలు చూసొద్దామని కాలేజీకి వెళ్లాడు.. పాత కక్షలో, క్షణి కావేశమో తెలీదు గానీ కొంతమంది యువకులు హఠాత్తుగా దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక విలవిల్లాడిపోయాడు.. పట్టపగలు జనసమూహానికి చేరువలో జరిగిన ఈ దారుణ హత్య చోడవరంలో సంచలనం సృష్టించింది.
రేస్ బైక్‌పై వచ్చారు..
తెల్లటి రేస్ బైక్‌పై వచ్చిన యువకులు కొట్టి చంపారని స్థానికులు చెప్పారు. గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకోడానికి ప్రయత్నించామని, అయితే తమకు వార్నిం గ్ ఇచ్చారని యువకులు తెలిపారు. వారి మధ్య గతంలో ఒకసారి గొడవ జరిగిందని, తాజా ఘటనలకు అదే కార ణమై ఉంటుందని చెప్పారు. ఈ ఘటనతో సిటిజన్ కాలనీ అంతా విషాదం అలముకుంది. ప్రసాద్ మంచివాడని, అం దరితో సరదాగా ఉంటాడని కాలనీవాసులు పేర్కొన్నారు.
విశాఖపట్నం, చోడవరం టౌన్: ఆకతాయిలు.. జులాయిగా తిరుగుతూ అందరితో గొడవ పడుతుంటారు.. అందరూ చూస్తుండగానే నిర్భయంగా ఓ యువకుడిని చంపేశారు.. కాలేజీ మైదానంలో ఒకపక్క అంతర కళాశాలల క్రీడాపోటీలు జరుగుతుండగానే ఈ ఘటన జరిగింది. కొట్టి కొట్టి బైక్‌పై తీసుకొచ్చి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గాంధీ గ్రామం పంచాయతీ సిటిజన్ కాలనీకి చెందిన చిలకా దుర్గా ప్రసాద్ (22) ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. భర్తను కోల్పోయి కొడుకుపైనే కోటి ఆశలు పెట్టుకున్న మృతుడి తల్లి పెడుతున్న రోదనలు చూపరులను సైతం కదిలిం చాయి. తల్లి ఫిర్యాదు మేరకు తొమ్మి ది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఆదివారం జిల్లా అంతర కళాశాలల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు తిలకిస్తున్న దుర్గాప్రసాద్‌ను కొంతమంది యువకులు పక్కకు లాక్కెళ్లారు. ఆటలు చూస్తూ ఎవరి హడావుడిలో వారుం డగా.. ఏమైందో తెలీదు గానీ ఒక్కసారిగా వారు ప్రసాద్‌పై దాడి చేశారు.
వెంటపడి మరీ కొట్టారు. తీవ్రగా యాలతో అపస్మారక స్థితిలో వున్న అతడిని బైక్‌పై రో డ్డుపైకి తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. స్థానికులు వెం టనే ప్రసాద్‌ని ఆటోలో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్టు సిబ్బంది ధ్రువీకరించారు. ఎస్సై మల్లేశ్వరరావు ఆస్పత్రి వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రసాద్ మరణవార్త విన్న తల్లి ఈశ్వరమ్మ, చెల్లి విద్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. దుర్గాప్రసాద్ సొంత గ్రామం వడ్డాది. తండ్రి మృతి చెందిన తరువాత పదే ళ్ల క్రితం గాంధీ గ్రామం వచ్చేశారు. ప్రసాద్ జీపు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ఒక కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరాడు.
తల్లడిల్లిన తల్లి హృదయం : దుర్గాప్రసాద్ తండ్రి చనిపోయిన తరువాత తల్లి ఈశ్వర మ్మ తన కుమార్తెను, కుమారుడిని తీసుకొని గాంధీ గ్రామం వచ్చేసింది. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను చదివిం చింది. దుర్గాప్రసాద్ పదో తరగతి చదివిన తరువాత చదువు మానేసి తల్లికి చేదోడుగా ఉంటూ జీపు డ్రైవింగ్ నేర్చుకొని చెల్లికి ఇటీవలే వివాహం చేశాడు. తల్లి ఈశ్వరమ్మ ఒక ప్రయివేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ప్రసాద్ ఒక కాంట్రాక్టరు వద్ద పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని పోషిస్తూ అండగా ఉంటాడనుకున్న కొడుకు హఠాత్తుగా హత్య కు గురవడంతో తాను అనాథగా మిగిలిపోయానని తల్లి ఈశ్వరమ్మ రోదిస్తోంది.
తొమ్మిదిమందిపై కేసు : తన కొడుకుపై తొమ్మిదిమంది దాడి చేసినట్టు దుర్గాప్రసాద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పుల్లేటి నరేంద్ర అలియాస్ కేటు, ప్రభాకర్ తదితరులపై కేసు నమోదు చేశారు. మిగతా నిందితులలో మైనర్లు కూడా ఉన్నారు. డీఎస్పీ వెంకటరమణ వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment