విశాఖపట్నం: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతికి గుట్టుచప్పుడుకాకుండా దహనసంస్కారాలు చేసే ప్రయత్నాన్ని కాటి కాపరులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధురవాడ కొమ్మాదికి చెందిన గోరి మీను (17) సోమవారం మృతిచెందడంతో దహన సంస్కారాల కోసం జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అక్కడి కాటికాపర్లు మృతదేహాన్ని చూసి ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో అభ్యంతరం చెబుతూ కంచరపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కథ అడ్డం తిరిగింది. కొమ్మాది గ్రామానికి చెందిన గోరి బహుదూర్ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సె క్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని కుమార్తె మీను పదోతరగతి చదివింది. సోమవారం ఆ యువతి మృతిచెందడంతో జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువచ్చి దహనం చేసేందుకు ప్రయత్నిం చగా కాటికాపరి అడ్డుకున్నాడు. మెడపై గాయాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి పోలీసులు చేరుకొని మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదుచేసి పీఎం పాలెం పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు కంచరపాలెం పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment