వైఎస్సార్‌సీపీ నాయకుడు దారుణహత్య | YSRCP Leader Murdered In YSR Kadapa | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడు దారుణహత్య

Published Tue, Jul 10 2018 12:18 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSRCP Leader Murdered In YSR Kadapa - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఇన్‌సెట్‌) మృతుడు రంగేశ్వరరెడ్డి

పులివెందుల : సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన రంగేశ్వరరెడ్డి(48) సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దారుణహత్యకు గురయ్యాడు. ఆయన కొన్నేళ్లుగా పులివెందుల పట్టణంలోని ఆటోనగర్‌ సమీపంలో ఉన్న బాకరాపురంలో నివాసముంటున్నాడు. భార్య వెంకటలకుష్మమ్మతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాత్రి ఆయన ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగరాజు, ఎస్‌ఐ రఘురాం సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతర నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని   అర్బన్‌ సీఐ పుల్లయ్యను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నిందితులను గుర్తించి  శిక్షించాలని చెప్పారు.  \

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement