లండన్లో కడియం శ్రీహరికి ఘన స్వాగతం | Hon'ble Dy CM sri kadiyam srihari in London airport | Sakshi
Sakshi News home page

లండన్లో కడియం శ్రీహరికి ఘన స్వాగతం

Published Tue, Jan 19 2016 10:39 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

లండన్లో కడియం శ్రీహరికి ఘన స్వాగతం - Sakshi

లండన్లో కడియం శ్రీహరికి ఘన స్వాగతం

లండన్ : లండన్లో జరుగుతున్న 'ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరం -2016'కు హాజరయ్యేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదివారంహీత్రూ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కడియం శ్రీహరికి బ్రిటన్లోని టీఆర్ఎస్ సెల్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

మంత్రి కడియం శ్రీహరికి స్వాగతం పలికిన వారిలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు మంద సునీల్రెడ్డి, కార్యదర్శులు నవీన్రెడ్డి, దొంతుల వెంకట్రెడ్డి, యూకే ఇంఛార్జ్ విక్రంరెడ్డి, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్లతోపాటు వినయ్కుమార్ ఆకుల, సత్య, సృజన్రెడ్డి చాడా, తెలంగాణా ఎన్నారై ఫోరం సలహా సంఘం సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఫోరంలో పాల్గొని.. ప్రస్తుత విద్యా విధానంపై చర్చిస్తున్నారు. ఈ సదస్సు జనవరి 17 వ తేదీన ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీతో ఈ సదస్సు ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement