తల్లిదండ్రుల మైండ్‌ సెట్‌ మారాలి.. | Government Gives Top Priority To Education, Kadiyam | Sakshi
Sakshi News home page

ప్రతి ఏడాది ఇంటర్‌ సిలబస్‌లో మార్పులు

Published Fri, Apr 13 2018 11:41 AM | Last Updated on Thu, Jul 11 2019 5:31 PM

Government Gives Top Priority To Education, Kadiyam - Sakshi

కడియం శ్రీహరి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకై దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు రూ.3 కోట్లు ఖర్చుపెట్టి 26 కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతియేడు ఇంటర్‌ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో కార్పొరేట్‌ కాలేజీల కన్నా ప్రభుత్వ కళాశాలలు ముందున్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించాలని అన్నారు.

కార్పొరేట్‌ చదువుల మోజులో  పడి డబ్బుని, విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని కడియం శ్రీహరి సూచించారు. తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ మారినపుడే విద్య కార్పొరేట్‌ మయం కాకుండా అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.కార్పొరేట్‌ కాలేజీల్లో ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలపై చర్యలు తీస్కోండని విద్యార్థులు సమాచారం ఇస్తున్నారనీ.. అయితే ఆయా కళాశాలలపై విద్యాశాఖ చర్యలు ప్రారంభించిన వెంటనే యాజమాన్యాలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నాయని అన్నారు. అన్ని కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించామని, కోచింగ్‌ల పేరిట ఎవరైన వేసవిలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement