సాక్షి, హైదరాబాద్: దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు మూడో తరగతి నుంచి పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత నిర్బంధ విద్యను అందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్‌ఆర్డీ)కు సిఫారసు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) మధ్యంతర నివేదికను ఈ నెల 16న హెచ్‌ఆర్డీకి అంది స్తామన్నారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్స హించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు కడియం అధ్యక్షతన హెచ్‌ఆర్డీ గతంలో కేబ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ బోర్డు గువాహటి, ఢిల్లీ, భువనేశ్వర్‌లో మూడుసార్లు సమావేశమైంది. మంగళవారం హైదరాబాద్‌లో నాలుగో సమావేశాన్ని నిర్వ హించింది. ఇందులో బాలికల విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లా డుతూ, సమావేశం నిర్ణయాలను, హెచ్‌ఆర్డీకి అందజేయనున్న సిఫారసులను వెల్లడించారు.
అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా వర్సిటీలు
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ రెసి డెన్షియల్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ బాలికలకు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని కడియం తెలి పారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మహిళా వర్సిటీలను అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీల్లో అందిస్తున్న విద్యను 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. మోడల్ స్కూళ్లలో చదివే బాలికలకు 100 మందికే హాస్టల్ సదుపాయం ఉందని, దానిని 200కు పెంచాలని సూచిస్తున్నామన్నారు. యుక్తవయస్సు బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, వారికి ఆరోగ్య–పరిశుభ్రత కిట్స్ ఉచితంగా అందించాల న్నారు. విద్యాలయాల్లో బాలికలకు భద్రత కల్పిం చడంతోపాటు టాయిలెట్స్ ఉండాలన్నారు.
త్వరలో మధ్యంతర నివేదిక..
అన్ని రాష్ట్రాల విద్యా శాఖలు అమలు చేస్తున్న పది ఉత్తమ విధానాలను సేకరించి, వాటి నుంచి 10 నుంచి 15 ఉత్తమ విధానాలను క్రోడీకరించి తుది నివేదికలో చేర్చి వాటి అమలుకు సిఫారసు చేస్తూ నివేదికను కేంద్రానికి ఇస్తామని కడియం చెప్పారు. 15, 16 తేదీల్లో «ఢిల్లీలో మరోసారి సమావేశమై మధ్యంతర నివేదికను అందిస్తామన్నారు. అసోం, జార్ఖండ్ విద్యా మంత్రులు హిమంత బిస్వా శర్మ, నీరజా యాదవ్, హెచ్‌ఆర్డీ స్పెషల్ సెక్రటరీ రీనా రాయ్, మెంబర్ సెక్రటరీ మీనాక్షీ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
పీజీ వరకు బాలికలకు ఉచిత నిర్బంధ విద్య
Published Wed, Jan 10 2018 1:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment