HRD
-
మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెచ్ఆర్డీఏ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఘన విజయం సాధించింది. హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్‌కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. హేమాహేమీలుగా పిలిచే ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ఓడిపోయారు. కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి డాక్టర్ 13 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ 13 ఓట్లను కలిపి ఒక్క ఓటుగా పరిగణిస్తారు. అలా ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్ కాగా, రకరకాల కారణాలతో 3,311 ఓట్లను రిటర్ణింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. మిగిలిన 13,779 ఓట్లను లెక్కించారు. అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, డాక్టర్ మహేశ్‌కుమార్ 6,735 ఓట్లు సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. మెడికల్ కౌన్సిల్ 25 మంది డాక్టర్లతో ఏర్పాటవుతుంది. అందులో 13 మంది ఇప్పుడు డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నికయ్యారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవినీ హెచ్ఆర్డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల మెడికల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు రిజి్రస్టేషన్ చేసుకుంటారు. ఈ ఎన్నికల్లో వారే ఓట్లేశారు. విజేతలు సాధించిన ఓట్లు ఇలా డాక్టర్ ప్రతిభా లక్ష్మి 7,007 ఓట్లు, డాక్టర్ కె.మహేష్‌కుమార్ 6,735, డాక్టర్ బండారి రాజ్‌కుమార్ 6,593, డాక్టర్ జి.శ్రీనివాస్ 6,454, డాక్టర్ కిరణ్‌కుమార్ 6,434, డాక్టర్ ఎస్.ఆనంద్ 6,192, యెగ్గన శ్రీనివాస్ 6,086, డాక్టర్ రవికుమార్ 6,085, డాక్టర్ నరేష్కుమార్ 6,091, డాక్టర్ శ్రీకాంత్ 5,974, డాక్టర్ సన్నీ దావిస్ 5,912, డాక్టర్ విష్ణు 5,844, డాక్టర్ సయ్యద్ ఖాజా ఇమ్రాన్ అలీ 5695 ఓట్లు సాధించారు. -
గడప దాటని గిరిజన వర్సిటీ!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీకి చిక్కుముళ్లు వీడటంలేదు. స్థల కేటాయింపులతో పాటు నిధులు విడుదలైనప్పటికీ వర్సిటీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన వర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. దీనికోసం భూసమీకరణ చేపట్టాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 ఎకరాలను గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం సమీపంలో దాదాపు 200 ఎకరాలను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరోవైపు జాకారం గ్రామం సమీపంలో ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)కోసం నిర్మించిన అత్యాధునిక భవనాన్ని కూడా వర్సిటీ కోసం కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ భవనంలో కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈమేరకు నిర్ణయించింది. భూముల అప్పగింతతో పాటు భవనాన్ని సైతం అప్పగించినా, అనుమతులు తదితర ప్రక్రియ కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. హెచ్ఆర్డీ వద్ద పెండింగ్... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సంబంధిత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో భాగంగా రెండుసార్లు హెచ్ఆర్డీ అధికారులు పర్యవేక్షణ సైతం చేపట్టినప్పటికీ అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా సోమవారం హెచ్ఆర్డీ అధికారులు వర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. పార్లమెంటులో బిల్లుతోనే... యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతితో పాటు వర్సిటీ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలలోనే వర్సిటీ బిల్లుకు ఆమోదం లభిస్తే 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభించ వచ్చని ఉన్నాతాధికారలు అంటున్నారు. -
‘‘జియో’కు ఆ హోదా ఇవ్వలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ (ఘనత వహించిన లేదా అత్యున్నత) హోదా కల్పించలేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. కనీసం భవనం కూడా లేని ‘జియో ఇన్స్టిట్యూట్’ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పించిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదా సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై స్పష్టతనివ్వాల్సిందిగా పలువురు ఎంపీలు ప్రశ్నించడంతో.. జియో ఇన్స్టిట్యూట్కు ఎటువంటి హోదా కల్పించలేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కమిటీ ప్రతిపాదనల మేరకే.. నిపుణుల కమిటీ ప్రతిపాదనల మేరకు జయో ఇన్స్టిట్యూట్కు హోదా కల్పించే విషయాన్ని పరిగణనలోకి మాత్రమే తీసుకున్నామని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, ఢిల్లీ ఐఐటీ, ఐఐటీ బాంబేలకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కల్పించామన్నారు. బిట్స్ పిలానీ, మణిపాల్ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, జియో ఇన్స్టిట్యూట్కు ఈ హోదా ఇవ్వాల్సిందిగా కొన్ని షరుతులతో కూడిన ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశారు. ఐఐటీ చెన్నై, జేఎన్‌యూలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని కమిటీ సిఫారసుల మేరకే హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. చదవండి : రిలయెన్స్ మీద అంత మోజెందుకు? -
పీజీ వరకు బాలికలకు ఉచిత నిర్బంధ విద్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు మూడో తరగతి నుంచి పీజీ వరకు గురుకుల విధానంలో ఉచిత నిర్బంధ విద్యను అందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్ఆర్డీ)కు సిఫారసు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) మధ్యంతర నివేదికను ఈ నెల 16న హెచ్ఆర్డీకి అంది స్తామన్నారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్స హించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు కడియం అధ్యక్షతన హెచ్ఆర్డీ గతంలో కేబ్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ బోర్డు గువాహటి, ఢిల్లీ, భువనేశ్వర్‌లో మూడుసార్లు సమావేశమైంది. మంగళవారం హైదరాబాద్‌లో నాలుగో సమావేశాన్ని నిర్వ హించింది. ఇందులో బాలికల విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. అనంతరం కడియం శ్రీహరి విలేకరులతో మాట్లా డుతూ, సమావేశం నిర్ణయాలను, హెచ్ఆర్డీకి అందజేయనున్న సిఫారసులను వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా వర్సిటీలు ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ రెసి డెన్షియల్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ బాలికలకు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని కడియం తెలి పారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మహిళా వర్సిటీలను అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీల్లో అందిస్తున్న విద్యను 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. మోడల్ స్కూళ్లలో చదివే బాలికలకు 100 మందికే హాస్టల్ సదుపాయం ఉందని, దానిని 200కు పెంచాలని సూచిస్తున్నామన్నారు. యుక్తవయస్సు బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని, వారికి ఆరోగ్య–పరిశుభ్రత కిట్స్ ఉచితంగా అందించాల న్నారు. విద్యాలయాల్లో బాలికలకు భద్రత కల్పిం చడంతోపాటు టాయిలెట్స్ ఉండాలన్నారు. త్వరలో మధ్యంతర నివేదిక.. అన్ని రాష్ట్రాల విద్యా శాఖలు అమలు చేస్తున్న పది ఉత్తమ విధానాలను సేకరించి, వాటి నుంచి 10 నుంచి 15 ఉత్తమ విధానాలను క్రోడీకరించి తుది నివేదికలో చేర్చి వాటి అమలుకు సిఫారసు చేస్తూ నివేదికను కేంద్రానికి ఇస్తామని కడియం చెప్పారు. 15, 16 తేదీల్లో «ఢిల్లీలో మరోసారి సమావేశమై మధ్యంతర నివేదికను అందిస్తామన్నారు. అసోం, జార్ఖండ్ విద్యా మంత్రులు హిమంత బిస్వా శర్మ, నీరజా యాదవ్, హెచ్ఆర్డీ స్పెషల్ సెక్రటరీ రీనా రాయ్, మెంబర్ సెక్రటరీ మీనాక్షీ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. -
IIM లకు స్వతంత్ర ప్రతిపత్తి!
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు).. దేశంలో మేనేజ్మెంట్ విద్యలో అత్యున్నత సంస్థలు. ఎందరో కార్పొరేట్ లీడర్లను తీర్చిదిద్దిన ఘనత వీటికే దక్కుతుంది. కానీ, కొన్ని పరిమితుల కారణంగా ఐఐఎంలు పూర్తిస్థాయి సామర్థ్యాలను ప్రదర్శించలేక పోతున్నాయనే అభిప్రాయం ఉంది. ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే దిశగా ఐఐఎంల బిల్లు–2015ను పార్లమెంట్ వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్లు ముఖ్యాంశాలు, దాని అమలుతో కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ.. బోధన, నిర్వహణ, ఇతర అంశాల్లో ఐఐఎంలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కొత్త కార్యాచరణకు సంబంధించిన బిల్లు 2015లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖకు చేరింది. అందులోని కొన్ని అంశాలపై హెచ్ఆర్డీ వర్గాలు ప్రతికూల వైఖరిని అవలంబించాయి. దీంతో ఏడాదిన్నరగా బిల్లులో మార్పులు జరిగాయి. చివరకు తాజాగా హెచ్ఆర్డీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. ఐఐఎం వర్గాలు పేర్కొన్న స్వతంత్ర ప్రతిపత్తిపై సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ బిల్లును పార్లమెంటు వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టి, కార్యరూపం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘విజిటర్’ హోదాకు స్వస్తి: బిల్లులో అత్యంత ప్రధాన అంశం..‘విజిటర్ హోదా’ అనే పదానికి స్వస్తి పలకాలని ఐఐఎంలు కోరడం, దానికి హెచ్ఆర్డీ అంగీకరించడం. ప్రస్తుతం ఐఐఎంల్లో అమలవుతున్న విధానం ప్రకారం రాష్ట్రపతికి విజిటర్ హోదా ఉంటోంది. ఈ హోదాలో ఒక ఇన్స్టిట్యూట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఐఐఎం వర్గాలను సంప్రదించకుండా నేరుగా ఎవరినైనా నియమించొచ్చు. దీనిపై ఐఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇప్పుడు ‘విజిటర్ హోదా’కు స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఐఐఎం ఫోరం: తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇకపై అన్ని ఐఐఎంలు కలిసి ఒక ఫోరంగా ఏర్పడనున్నాయి. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఫోరం ఏర్పాటు వల్ల ఐఐఎంల మధ్య నిరంతరం సంప్రదింపులు, ఎక్సే్ఛంజ్ కార్యకలాపాలకు వీలవుతుంది. తద్వారా అకడమిక్‌గా, అడ్మినిస్ట్రేషన్ పరంగా సమర్థ నిర్వహణకు అవకాశం ఉంటుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఐఐఎం ప్రత్యేకంగా ఉండాలని, ఇతర ఐఐఎంలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఫోరం వల్ల ఆశించిన ఉద్దేశం నెరవేరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో స్వేచ్ఛ: ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి కూడా కొత్త బిల్లు ద్వారా ఐఐఎంలకు స్వతంత్రత లభించనుంది. నిర్దిష్టంగా ఒక ఐఐఎంకు గవర్నింగ్ బోర్డ్ డైరెక్టర్ నేతృత్వంలో ఫ్యాకల్టీని నియమించే అవకాశం ఉంది. అయితే వీరికి వేతనాలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో సెంటర్లు: కొత్త బిల్లు ప్రకారం నిబంధనల మేరకు ఐఐఎంలు విదేశాల్లో తమ సెంటర్ల ఏర్పాటుకు అవకాశముంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ సెంటర్ల వల్ల కొలాబరేటివ్ పరిశోధన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. స్వదేశంలోనూ వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు. ఎంబీఏ పట్టాలు: ఐఐఎంలు ప్రస్తుతం రెండేళ్ల వ్యవధిలో పీజీ డిప్లొమా పేరుతో అందిస్తున్న కోర్సులకు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంబీఏ పేరుతో పట్టాలు ఇవ్వనున్నాయి. రెండేళ్లపాటు చదివినా పీజీ డిప్లొమా టైటిల్ వల్ల అంతర్జాతీయంగా సరైన గుర్తింపు రావడం లేదని, అందువల్ల ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలని పలువురు పూర్వ విద్యార్థులు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రీసెర్చ్ కార్యకలాపాలకు ప్రాధాన్యం: బిల్లులో మరో ప్రధానాంశం ఒక ఐఐఎం స్వయంగా రీసెర్చ్ యాక్టివిటీస్ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ క్రమంలో రీసెర్చ్‌కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు వంటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్ కౌన్సిల్‌కే పూర్తి నిర్ణయాధికారాలు లభిస్తాయి. డైవర్సిటీకి ప్రాధాన్యం: ఐఐఎంల్లో సిబ్బంది నియామకాలు, కోర్సుల ప్రవేశాల విషయంలో డైవర్సిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. మహిళలు, దివ్యాంగులతోపాటు అన్ని సామాజిక వర్గాలు, నేపథ్యాలకు చెందిన వారికి అవకాశం లభించేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు. త్వరితగతిన డైరెక్టర్ల నియామకం: సాధారణంగా ఒక డైరెక్టర్ పదవీ కాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందుగానే కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియ ప్రారంభించాలి. పదవీ కాలంలో డైరెక్టర్ వైదొలగితే నెల వ్యవధిలో కొత్త డైరెక్టర్ నియామకానికి గవర్నింగ్ బోర్డ్ చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం వివిధ ఐఐఎంల్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయితే ఏళ్ల తరబడి భర్తీ కాని పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి తాజా బిల్లులో సిఫార్సులు చేశారు. త్వరితగతిన డైరెక్టర్ల నియామకాలు చేపట్టాలని బిల్లులో స్పష్టం చేశారు. దీనివల్ల సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. బిల్లు ముఖ్యాంశాలు విజిటర్ హోదాకు స్వస్తి డైరెక్టర్ల నియామకానికి గవర్నింగ్ కౌన్సిల్‌కు అధికారం రీసెర్చ్ యాక్టివిటీస్ పరంగా స్వయంప్రతిపత్తి పీజీ డిప్లొమా స్థానంలో ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్ల ప్రదానం దేశ, విదేశాల్లో సెంటర్ల ఏర్పాటుకు అవకాశం ఐఐఎం కామన్ ఫోరం ఏర్పాటు డైవర్సిటీకి తప్పనిసరిగా ప్రాధాన్యం -
నన్నయలో హెచ్ఆర్డీ సెంటర్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : భవిషత్తులో ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో హెచ్ఆర్డీ సెంటర్ కీలకపాత్ర వహిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీలో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ సెంటర్‌ని బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సెంటర్ ద్వారానే ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తామని వికాస్ పీడీ వీఎన్ రావు అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కేఎన్ రమేష్, అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.టేకి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఐ కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నాం
అనంతపురం అర్బన్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్తల వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణì ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, చట్టంపై పరిపూర్ణ పరిజ్ఞానం కలిగి, అందులో ఈ లక్ష్యాల దిశగా కృషి చేస్తున్నవారు తమ వివరాలను ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా అందజేయాలని తెలి పారు. ఠీఠీఠీ.్చpజిటఛీజీ.్చp.జౌఠి.జీn సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు'
పాట్నా: కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అమాయకురాలని ఆర్డేజీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కితాబిచ్చారు. మానవ వనరుల శాఖ మంత్రిగా వీలైనన్ని మంచి పనులు చేశారని ఆయన ప్రశంసించారు. అయితే... ఇతర కార్యక్రమాల్లో స్మృతి ఎక్కువ బిజీ కావటం వల్లే హెచ్ఆర్డీ శాఖను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. చేనేత శాఖలో ఆమె అంతగా రాణిస్తుందనుకోవటం లేదని లాలూ వ్యాఖ్యానించారు. కాగా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతి శాఖను మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే ప్రధాన పాత్ర పోషిస్తానని ఆయన అన్నారు. లాలూ గతంలో సునీల్ శెట్టి హీరోగా నటించిన 'పద్మశ్రీ లాలూప్రసాద్ యాదవ్' చిత్రంలో నటించారు. -
విద్యావ్యవస్థలో తక్షణ మార్పులు అవసరం
‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై ఏర్పాటైన కమిటీ అభిప్రాయం న్యూఢిల్లీ: నిర్లక్ష్య లేదా అవినీతితో కూడిన నియంత్రణ వ్యవస్థలు నాణ్యత లేని ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తికి కారణమవుతున్నాయని కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రస్తుత విధానంలో లోపాలతో పాటు ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’ తయారీ కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖకు కమిటీ కొన్ని సూచనలు చేసింది. విద్యపై ఏ మాత్రం ఆసక్తిలే కుండా, కేవలం డబ్బుతో ప్రభావితం చేసే వ్యక్తుల వల్ల అనేక ప్రైవేట్ వర్సిటీలు, కాలేజీలు వర్ధిల్లుతున్నాయని, అవినీతిలో కూరుకున్న నియంత్రణ వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి అస్తవ్యస్త ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తిని అడ్డుకునేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకత లేని ఆర్థిక నిర్వహణను ప్రస్తుత వ్యవస్థ ప్రోత్సహిస్తోం దని, ఇది పరోక్షంగా నల్లధనాన్ని వినియోగానికి కారణమవుతోందని వెల్లడించింది. తాత్కాలిక, గెస్ట్ టీచర్లపై ఎక్కువగా ఆధారపడడం నాణ్యమైన విద్య వ్యవస్థకు వ్యతిరేకమని కమిటీ తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో సిబ్బంది నియామకాలపై కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సమీక్ష జరగాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా అధ్యాపకుల నియామకాల వల్ల కూడా భర్తీ ఆలస్యమవుతోందని వెల్లడిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపు తప్పనిసరి చేయాలంది. సాంకేతిక, వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలకూ యూజీసీ గుర్తింపు తప్పనిసరని పేర్కొంది.ఈ కమిటీ నివేదికను కేంద్ర మానవ వనరులశాఖ అధికారులు పరిశీ లించి ఎన్ఈపీ తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు. -
రోహిత్ మృతికి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆందోళన