నిర్లక్ష్య లేదా అవినీతితో కూడిన నియంత్రణ వ్యవస్థలు నాణ్యత లేని ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తికి కారణమవుతున్నాయని కొత్త విద్యా విధానం(ఎన్‌ఈపీ)పై ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయపడింది.
‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై ఏర్పాటైన కమిటీ అభిప్రాయం
న్యూఢిల్లీ: నిర్లక్ష్య లేదా అవినీతితో కూడిన నియంత్రణ వ్యవస్థలు నాణ్యత లేని ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తికి కారణమవుతున్నాయని కొత్త విద్యా విధానం(ఎన్‌ఈపీ)పై ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రస్తుత విధానంలో లోపాలతో పాటు ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’ తయారీ కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖకు కమిటీ కొన్ని సూచనలు చేసింది. విద్యపై ఏ మాత్రం ఆసక్తిలే కుండా, కేవలం డబ్బుతో ప్రభావితం చేసే వ్యక్తుల వల్ల అనేక ప్రైవేట్ వర్సిటీలు, కాలేజీలు వర్ధిల్లుతున్నాయని, అవినీతిలో కూరుకున్న నియంత్రణ వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని కమిటీ అభిప్రాయపడింది.
ఇలాంటి అస్తవ్యస్త ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తిని అడ్డుకునేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకత లేని ఆర్థిక నిర్వహణను ప్రస్తుత వ్యవస్థ ప్రోత్సహిస్తోం దని, ఇది పరోక్షంగా నల్లధనాన్ని వినియోగానికి కారణమవుతోందని వెల్లడించింది. తాత్కాలిక, గెస్ట్ టీచర్లపై ఎక్కువగా ఆధారపడడం నాణ్యమైన విద్య వ్యవస్థకు వ్యతిరేకమని కమిటీ తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో సిబ్బంది నియామకాలపై కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సమీక్ష జరగాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా అధ్యాపకుల నియామకాల వల్ల కూడా భర్తీ ఆలస్యమవుతోందని వెల్లడిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపు తప్పనిసరి చేయాలంది. సాంకేతిక, వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలకూ యూజీసీ గుర్తింపు తప్పనిసరని పేర్కొంది.ఈ కమిటీ నివేదికను కేంద్ర మానవ వనరులశాఖ అధికారులు పరిశీ లించి ఎన్‌ఈపీ తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు.