విద్యావ్యవస్థను పటిష్టం చేస్తాం
- గురుకుల, ఆదర్శ పాఠశాలలకు రూ.116 కోట్లు కేటారుుంచాం
- స్కూల్ లీడర్స్ మీట్-2016లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గింది. దీంతో వీటిలో ప్రవేశాలపై ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్వాకంతో ఈ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల పరపతి పూర్తిగా పడిపోరుుంది. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన మా ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణరుుంచింది. దశల వారీగా, పక్కా ప్రణాళికతో వీటిని గాడిలో పెడ్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’అని ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో స్కూల్ లీడర్స్ మీట్-2016ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత పదేళ్ల కాలంలో ఆశ్రమ పాఠశాలలకు నిధులు ఇవ్వలేదు. తాజాగా రూ.116 కోట్లు విడుదల చేశాం. ప్రతి ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. అన్ని సౌకర్యాలు కల్పించి జవహర్ నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా తయారు చేస్తాం’అన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
చాలాచోట్ల ఆదర్శ పాఠశాలల్లో సమస్యలున్నాయని, క్షేత్రస్థారుులో పర్యటించినప్పుడు ఈ విషయాల్ని ప్రత్యక్షంగా చూశానని కడియం శ్రీహరి వివరించారు. దాదాపు అన్ని మోడల్ స్కూళ్లలో మొదటి అంతస్తు అసంపూర్తిగా ఉందన్నారు. ప్రహరీ గోడలు లేకపోవడంతో వసతి గృహాల్లోని బాలికలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా రూ.40 కోట్లతో ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధన ప్రక్రియ ముందుకు సాగాలని, ఈ క్రమంలో సబ్జెక్టు టీచర్లకు శిక్షణ తప్పనిసరని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆశ్రమ, ఆదర్శ పాఠశాలలకు గ్రేడింగ్ ఇస్తామని, అత్యుత్తమ గ్రేడ్ పొందిన పాఠశాలలకు అవార్డులు కూడా ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు ప్రిన్సిపాళ్లతో ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సమస్యలు విని పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డెరైక్టర్ కిషన్, టీఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.