ప్రవాసాంధ్రుల్ని ఆలరించిన 'ఎన్నెన్నో జన్మల బంధం'!
అమెరికాలోని గ్రేటర్ వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని గ్రీన్ బెల్ట్, మేరిలాండ్ లో స్థానిక రూజ్వెల్ట్ హైస్కూల్ ఆడిటోరియం లో గత శనివారం సాయంత్రం "ఎన్నెన్నో జన్మల బంధం" పేరిట ప్రముఖ గాయకుడు యస్పీ బాల సుబ్రమణ్యానికి స్వరార్చన జరిగింది. చిమట మ్యూజిక్ అధినేత శ్రీనివాసరావు చిమట, స్థానికంగా తెలుగు కమ్యూనిటికి సేవలు అందిస్తున్న శ్రీనివాసరావు చందు తో కలిసి ఈ సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది సంగీతాభిమానులు హాజరయ్యారు.
ఆద్యంతము ఉత్సాహంగా సాగిన బాలు మధుర గీతాల స్వరార్చన సాగరంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు. 'సూపర్ సింగర్' అంజనా సౌమ్య, అమెరికా లో జూనియర్ బాలుగా పేరున్న రాము, సందీప్ కౌత లు కలిసి 4 గంటల పైగా దాదాపు 35 పాటలు పాడి అందరినీ అలరించారు. తెలుగు మెలోడీలకు అమెరికా లో ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించడానికే చిమటమ్యూజిక్ సంస్థ ఇలాంటి సంగీత శ్రేణులను గత 5 యేళ్ళుగా అమెరికాలోని వివిధ నగరాల్లోని తెలుగు సంగీతాభిమానులకు అందిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు.

ఇంటర్నేషనల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ ఉదయ భాస్కర్ గంటి గ్రాండ్ స్పాన్సర్ గా, యూనిఫై సొల్యూషన్స్ అధినేత వెంకట్ సానా ప్లాటినం స్పాసర్లగా, ప్యారదైజ్ ఇండియన్ రెస్తారెంట్ ఫుడ్ వెండర్ గా, మేరీలాండ్ మాంటిసోరి అకాడమీ, చట్నీ రెస్తారెంట్,కృష్ణా ట్రెయినింగ్ గోల్డ్ స్పాన్సర్లగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పాన్సర్లకు, వాలంటీర్లకు (శ్రీనివాస్ శీలంశెట్టి, వెంకటరెడ్డి యెర్రం, మనోజ్ చేకూరి, వెంకట్ వుండమట్ల, శివ బొల్లం, శ్రీనివాసులు నగరురు, రాజేష్ సుంకర, కృష్ణమోహన్ అమృతం, ఆనంద్ గుమ్మడిల్లి, చంద్రశేఖర్ కోలా, మనోజ్ భాగవతుల తదితరులు) శ్రీనివాస్ చందు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.