వైట్‌హౌస్‌ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత | Two Indian-Americans selected for prestigious poet program | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత

Published Fri, Sep 2 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

వైట్‌హౌస్‌ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత

వైట్‌హౌస్‌ కవిసమ్మేళనానికి భారత సంతతి యువత

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో ఈ నెల 8వ తేదీన నిర్వహించే కవిసమ్మేళనానికి భారత సంతతికి చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. అమెరికా ప్రథమ మహిళ, ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా ఈ వర్ధమాన యువ కవులకు స్వయంగా స్వాగతం పలకనున్నారని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జార్జియాలో ఉంటున్న మాయా ఈశ్వరన్‌తోపాటు టెక్సాస్‌లోని డల్లాస్‌లో నివాసముంటున్న గోపాల్‌ రామన్‌.. సమ్మేళనంలో తమ కవితాసంపత్తిని ప్రదర్శించనున్నారు.

వీరిద్దరి వయసు 20 ఏళ్ల లోపే కావడం గమనార్హం. వీరితోపాటు మరో ముగ్గురు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2011 నుంచి ‘నేషనల్‌ స్టూడెంట్స్‌ పొఝెట్స్‌ ప్రోగ్రామ్‌’పేరుతో అమెరికా అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళలు, రచనల్లో దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనబర్చిన యువకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. కార్యక్రమం అనంతరం నేషనల్‌ స్కాలస్టిక్‌ ఆర్ట్‌ అండ్‌ రైటింగ్‌ అవార్డును అందజేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement