ఉక్రెయిన్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల హత్య
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో ఇద్దరు భారతీయ విద్యార్థులు దారుణహత్యకు గురికాగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉక్రెయిన్ జాతీయులు భారతీయ విద్యార్థులపై దాడి చేసి కత్తులతో పొడిచారు. మృతులను ప్రణవ్ శాండిల్య, అంకుర్ సింగ్గా గుర్తించారు. గాయపడిన మరో విద్యార్థి ఇంద్రజిత్ చౌహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సివుంది.
బాధితులు ముగ్గురు ఉక్రెయిన్లోని ఉజ్గొరొడ్ మెడికల్ కాలేజీ విద్యార్థులు. ఉక్రెయిన్లో భారత్ ఎంబసీ అధికారులు బాధితుల కుటుంబాలకు సమాచారం అందించారు. స్థానికులు, పోలీసులు, యూనవర్శిటీ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు ఎంబసీ అధికారులు చెప్పారు. ఉక్రెయిన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.