నో మురుగు!
నో మురుగు!
Published Mon, Sep 26 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– వందశాతం భూగర్భ డ్రైనేజీ
– కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్
– కోర్టుకేసులు, పీసీబీ మొట్టికాయలే కారణం
– కొత్తగా 80 వేల కనెక్షన్లు ఇవ్వాలని అంచనా
విజయవాడ సెంట్రల్ : విజయవాడ నగరంలో నూరు శాతం యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్) కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. నగరంలోని ప్రతి ఇంటికి అండర్ గౌండ్ డ్రెయినేజ్ కనెక్షన్లను తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు త్వరలో డివిజన్ స్థాయిలో మేళాలు నిర్వహించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. నగరంలో 1.87 లక్షల గృహాలకు సంబంధించి ఆస్తిపన్ను వసూలవుతుండగా, 62 వేల యూజీడీ కనెక్షను మాత్రమే ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లు, గ్రూపుహౌస్‌లు సంబంధించి ఒక్కో కనెక్షనే ఉంటుంది కాబట్టి వాటిని మినహాయించినా ఇంకా సుమారు 80 వేలకు పైగా యూజీడీ కనెక్షన్లు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు లెక్కతేల్చారు. కోర్టుకేసులు, కాలుష్యనియంత్రణ మండలి (పీసీబీ) అక్షింతలే తాజా కార్యాచరణకు కారణం.
మురుగంతా కాలువల్లోకే
యూజీడీ కనెక్షన్ల కోసం త్వరలో డివిజన్ స్థాయి మేళాలు జరపాలని కమిషనర్ వీరపాండియన్ ప్రస్తావించగా కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. సిటీలో అత్యధిక ప్రాంతాల్లోని మురుగు, వ్యర్థాలు దశాబ్ధాలుగా ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో కలుస్తున్నాయి. ఇదే నీటిని సాగు, తాగు అవసరాలకు వాడుతున్న గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి నగరాలు సహా వందలాది గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు గతంలో కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు పని
సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (ఎస్‌టీపీ)లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇప్పటి వరకు నగరపాలక సంస్థ యూజీడీ కనెక్షన్ల మంజూరుపై పెద్ద దృష్టి పెట్టలేదు. జెఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా నగరంలో యూజీడీ పనులకు రూ.500 కోట్ల ఖర్చు చేశారు. ప్రస్తుతం సింగ్‌నగర్, రామలింగేశ్వరనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ఎస్‌టీపీలు వినియోగంలో ఉన్నాయి. ఒన్‌టౌన్ ప్రాంతంలో రైల్వేశాఖ అభ్యంతరాల వల్ల పైప్‌లైన్ నిర్మాణ పనులకు బ్రేక్‌పడింది. సుమారు 20 కోట్ల ఖర్చుతో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.
వంద కోట్ల ఆదాయ లక్ష్యం
నూరుశాతం యూజీడీ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా కాల్వల్లో కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక సంక్షోభంలోనున్న నగరపాలక సంస్థకు దండి గా ఆదాయం వచ్చే అవకాశం ఉం ది. 80 వేలకు పైగా కనెక్షన్లు మం జూరు చేయడం ద్వారా రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్ల ఆదా యం వస్తుందని లెక్కలేస్తున్నారు.
Advertisement
Advertisement