సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరపాల క సంస్థ నగరంలో పర్యావరణ హితమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది.. ఇందన ఖర్చు పొదుపుతో పాటు, పర్యావరణ పరిరక్షణకోసం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశ పెట్టనుంది.. ముందుగా వీఎంసీ అధికారులకు ఆ వాహనాలు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. వచ్చే నెలలో విజయవాడ నగర రోడ్లపై ఎలక్ట్రికల్ వాహనాలు రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి వాణిజ్యరాజధానిగా పేరున్న విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివా రణతో పాటు వీఎంసీ నిర్వాహణలో ఉన్న వాహనాల ఇంధన ఖర్చును పొదుపుచేసే క్రమంలో పర్యావరణ హితమైన వాహనాలను వినియోగించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ వాహనాలను విజయవాడలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.. వచ్చే అక్టోబర్ నెలాఖరులోపు నగరపాలక సంస్థ కు ఈ కార్లును అందుబాటులోకి తేనున్నారు.. తొలివిడతగా వీఎంసీ అధికారులు ఈ వాహనాల ను ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.. ఈక్రమంలో వీఎంసీలో ఉన్న 24 మంది అధికారులకు ఈ–కార్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
నోయీడా కంపెనీతో ఒప్పందం
వీఎంసీ నోయీడాకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్‌తో ఆరునెలల క్రితం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 24 కార్లను వీఎంసీ రిజర్వ్ చేసింది. ఒక్కో కారు ఖరీదు రూ.12 నుంచి 15 లక్షల లోపు ఉంటుం దని అధికారులు తెలిపారు.. ఒక్కో కారుకు ప్రతి నెల రూ. 20 వేల ఈఎంఐ చొప్పున 72 నెలలపాటు చెల్లించేలా, అలాగే ఐదేళ్ల ఏళ్లపాటుసర్వీస్ కలిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అధిక బ్యాటరీ సామర్థ్యంతో గంట చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు తిరిగే ఈ కార్లకు నగరంలోని బ్యాటరీ బంక్‌లు కూడా ఏర్పాటవుతాయని, నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఏలూరు, బందరురోడ్డులో తొలుత రెండుబ్యాటరీ బంకులను ఏర్పాటు చేయటానికి ఈఈఎస్‌ఎల్ సంస్థ ప్రణాళికలు రూపొం దిస్తుందని అధికారులు తెలిపారు.
సొంతకార్లే అద్దెకార్లుగా..!
వీఎంసీలో వివిధ విభాగాల్లో ఉన్న అధికారులు దొడ్డిదారిలో వారి సొంతవాహనాలనే అద్దెవాహనాలుగా చూపుతూ వీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సొంతకార్లకు కూడా వీఎంసీ నుంచి అద్దె తీసుకుంటూ తమ సొంతపనులకు సైతం వినియోగిస్తున్నారని ఆరోపణల ఉన్నాయి. వీఎంసీలో దాదారు 80 శాతం అధికారులు ఒనర్‌ప్లేట్‌తో ఉన్న కార్లను వినియోగించటంపై కౌన్సిల్‌ల్లో కూడా పలుమార్లు ఈ అంశంపై రచ్చజరిగిన సంగతి తెల్సిందే.. సొంత కార్ల వినియోగంపై పలుమార్లు చర్చ జరిగినా అధికారులు పట్టించుకోక పోగా దర్జాగా సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు.
ఈ– కార్లతో తగ్గనున్న ఆర్థిక భారం
వీఎంసీలో వివిధ విభాగాల అధికారులకు కేటా యించిన వాహనాల నిర్వహణ అంతా వీఎంసీనే చూసుకుంటుంది. కమిషనర్, అడిషనల్ కమీషనర్, సీఎంవోహెచ్ మినహా మిగిలిన అధికారుల కార్లన్నీ అద్దెప్రాతిపదికన ప్రతినెలా రూ. 25–45 వేల వరకు అద్దె చెల్లిస్తున్నాయి. కార్పొరేషన్‌లో ఆయా విభాలకు చెందిన 50 మంది అధికారులకు కారును సమకూర్చాల్సి వస్తుంది. దీనికిగాను ఆయా కార్ల నిర్వహణకు 12 లక్షల నుంచి రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి రూ. కోటిన్నర అవుతుం ది. వీటి నిర్వహణలో తొలుత 24 కార్లను ఆయా విభాగాల అధికారులకు కేటాయింపు జరిపేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండో విడతగా మిగిలిన అధికారులకు కూడా సమకూర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment