12 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి
Published Mon, Feb 20 2017 11:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
నంద్యాల అర్బన్: జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరుగుతోందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యాగంటి పల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సోమవారం స్థానిక కార్యాలయంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,20,000 హెక్టార్లలో విత్తనోత్పత్తి జరుగుతోందన్నారు. వీటిని పక్క రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మునిరత్నం, రమారెడ్డి, జోనల్ సీడ్ ఆఫీసర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
Advertisement